పవన్ సినిమాల పరిస్థితిపై వచ్చిన క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలతో నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈనేపథ్యంలో.. పవన్ పూర్తిచేయాల్సిన మూడు సినిమాలు ‘హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితి ఏంటి? అనే చర్చ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

తాజాగా.. తన సినిమాల పరిస్థితిపై ఓ క్లారిటి ఇచ్చేశారు పవర్ స్టార్. ఉప్పాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి అభిమానులతో ప్రస్తావించారు. ఉప్పాడ సభలో పవన్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులంతా ‘ఓజీ.. ఓజీ’ అంటూ అరిచారు. దీంతో.. ‘మనం ‘ఓజీ’ అంటే.. ప్రజలు క్యాజీ అంటారు.. మూడు నెలలపాటు షూటింగ్‌ లకు దూరంగా ఉంటాను.. ఆ తర్వాత కుదిరినప్పుడు రెండు, మూడు రోజులు సినిమాలు చేసి వస్తా’ అని చెప్పారు పవన్. ఆ మేరకు నిర్మాతలను కూడా ఒప్పించినట్టు పవన్ తెలిపారు. మొత్తానికి.. పవన్ తాజా వ్యాఖ్యాలతో ఆయన సినిమాల పరిస్థితిపై ఓ క్లారిటీ వచ్చినట్టయ్యింది.

Related Posts