‘భారతీయుడు 2‘తో పోటీకి సిద్ధమైన అక్షయ్ కుమార్

విశ్వ నటుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కలయికలో రాబోతున్న క్రేజీ సీక్వెల్ ‘ఇండియన్ 2‘. ఈ సినిమా జూలై 12న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళంలో ‘ఇండియన్ 2‘గా వస్తోన్న ఈ సినిమా తెలుగులో ‘భారతీయుడు 2‘గానూ.. హిందీలో ‘హిందూస్థానీ 2‘గానూ అనువాద రూపంలో విడుదలవుతోంది.

తెలుగు, తమిళం భాషల్లో ‘ఇండియన్ 2‘కి పెద్దగా కాంపిటేషన్ లేకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం బడా క్లాష్ తప్పడం లేదు. బాలీవుడ్ ఖిలాడి హీరో అక్షయ్ కుమార్ ‘సర్ఫీరా‘ జూలై 12న విడుదలకు ముస్తాబవుతోంది. అక్షయ్ ‘సర్ఫీరా‘ సినిమా సూర్య నటించిన ‘సూరరై పొట్రు‘కి రీమేక్. ఒరిజినల్ ని తెరకెక్కించిన సుధా కొంగర డైరెక్షన్ లోనే ‘సర్ఫీరా‘ తెరకెక్కింది. ఈ సినిమాలో సూర్య కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా రిలీజైన అక్షయ్ ‘సర్ఫీరా‘ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Related Posts