వరలక్ష్మి పెళ్లిసందడిలో బాలకృష్ణ, వెంకటేష్

వరలక్ష్మి శరత్ కుమార్ – నికోలై సచ్‌దేవ్‌ పెళ్లి సందడి మొదలైంది. ఈ సెలబ్రేషన్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలకు సంబంధించిన చాలామంది స్టార్స్ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్.. ఈ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలకృష్ణకు చెల్లెలు పాత్రలో నటించింది వరలక్ష్మి.

ఈ మూవీలో వరలక్ష్మి పోషించిన పాత్ర ఎంతో హైలైట్ గా నిలిచింది. ఇక.. ఈ పెళ్లిసందడిలో బాలయ్య, వెంకీ లు సందడి చేస్తున్న ఫోటోలను సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

Related Posts