అభిరామ్ చిత్రంలో”చాల్లే చాల్లే” పాటను విడుదల

లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం “అభిరామ్” ఈ చిత్రం నుండి విడుదల చేసిన ‘సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల లిరికల్ సాంగ్ కు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం లోని పాటలు టిప్స్ ఆడియో ద్వారా విడుదల అవుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రంలోని “చాల్లే చాల్లే” లిరికల్ సాంగ్ ను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు.అనంతరందర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ..లెజెండరీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించిన “అభిరామ్” సినిమాలోని “చాల్లే చాల్లే” అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను చూడడం జరిగింది. ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపించేలా చాలా క్యాచీగా ఉంది. మీనాక్షి భుజంగ్ మ్యూజిక్ కంపోజిషన్ లో తనే ఈ పాటను పాడడం విశేషం.ఈ పాటలో విజువల్స్ చాలా బాగున్నాయి.