హారర్ కామెడీతో ఆకట్టుకుంటున్న “తోడేలు” ట్రైలర్

ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ కొత్త సినిమా బేడియా ట్రైలర్ వచ్చేసింది. సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా బేడియాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. ఈ సినిమా తెలుగు లో “తోడేలు” పేరు తో రాబోతుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాత. హీరో వరుణ్ ధావన్ ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్లవుతున్న సందర్భంగా “తోడేలు” ట్రైలర్ ను విడుదల చేశారు. బేడియా హిందీ తెలుగు తమిళ భాషల్లో నవంబర్ 25న రిలీజ్ అవ్వనుంది.అరుణాచల్ అడవుల నేపథ్యంగా బేడియా కథ సాగుతుంది.