“ఆర్య 34” చిత్రం గ్రాండ్ గా ప్రారంభం

అనేక బ్లాక్‌బస్టర్‌లు, విజయవంతమైన చిత్రాలను అందించిన జీ స్టూడియోస్ & డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థల సంయుక్త నిర్మాణంలో ‘ఆర్య 34’ వర్కింగ్ టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. యూనిక్ కథలు, పాత్రలు ఎంచుకుంటూ టెడ్డీ, సార్పట్ట పరంపర, కెప్టెన్ వంటి వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న ఆర్య ఈ చిత్రంలో కథానాయకుడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘వెందు తనింధతు కాదు’ చిత్రంలో బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్ చేసిన సిద్ధి ఇద్నాని ఈ చిత్రంలో కథానాయిక.

ఈ చిత్రం గురించి జీ స్టూడియోస్‌లో సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, “ ఆర్య కథానాయకుడిగా ముత్తయ్య దర్శకత్వంలో డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్‌ తో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఆర్య తన వెర్స్ టైల్ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముత్తయ్య ప్రేక్షకుల పల్స్‌ను తెలుసుకున్న దర్శకుడు. వీరి కలయిక ప్రేక్షకులకు వినోదాత్మక చిత్రాన్ని అందించడం ఖ