E 3 with Love చిత్రాన్ని ఓపెనింగ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల

ఎస్‌వీఎన్ రావ్ సమర్పణలో శ్రీకాంత్ పరకాల మరియు శివ ప్రధాన పాత్రల్లో దీక్షిత్ కోడెపాక రచన, దర్శకత్వంలో వాయుపుత్ర క్రియేషన్స్ పతాకం పై నిర్మించబడుతున్న “E 3 with Love” చిత్రం హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కి దర్శకుడు శేఖర్ కమ్ముల క్లాప్ ఇవ్వగా ఎస్ వి ఎన్ రావు మరియు తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం లో దర్శకుడు సతీష్ వేగ్నేశ కూడా పాల్గొన్నారు.