తేజ సజ్జా బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

కెరీర్ ప్రారంభం నుండే సబ్జెక్ట్‌ ల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్న ప్రామిసింగ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హనుమాన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. పుట్టినరోజు స్పెషల్ గా.. తేజ సజ్జా బ్రాండ్ న్యూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ పోస్టర్ లో తేజ సజ్జా సంప్రదాయ వస్త్రధారణలో తలపాగ చుట్టుకుని, ఎడ్ల బండిని నడుపుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ప్రత్యేక శక్తులతో సూపర్‌హీరోగా కనిపించనున్న ఈ చిత్రంలో తేజ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించనున్నారు.

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌ టై�