బాలీవుడ్ ను కాపాడాల్సింది ఖాన్, కపూర్ లే

గతంలో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకున్నది ప్రపంచం. ఆ పర్సెప్షన్ ను మార్చి ఇండియన్ సినిమా అంటే సౌత్ ఇండియానే అని కొత్తగా డిసైడ్ చేసింది సౌత్. ఆ రేంజ్ లో వస్తోన్న సినిమాలతో బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరుసగా సౌత్ మూవీస్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. దీంతో మన సినిమాలకు దీటుగా వారూ కొత్తగా ప్రయత్నాలు చేస్తోన్న అవేవీ వర్కవుట్ కావడం లేదు. టాప్ స్టార్స్ నుంచి మినీ స్టార్స్ వరకూ మాగ్జిమం ట్రై చేస్తోన్న బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావడం లేదు. గత రెండేళ్లలో అక్కడ సాలిడ్ హిట్ అంటే రీసెంట్ గా వచ్చిన చిన్న హీరో సినిమా భూల్ భులాయా మాత్రమే. అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో బాలీవుడ్ కు కొత్త భయం పట్టుకుంది. రాబోయే రోజుల్లో తమ సినిమాల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తోంది. ఈ టైమ్ లో వస్తోన్న రెండు సినిమాలపై వాళ్లు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఆ రెండు సినిమాలే లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర.ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన లాల్ సింగ్ చద్దా హాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్. ఆ మధ్య విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది ఆగస్ట్ 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మానసికంగా ఎదగని ఓ వ్యక్తి ఆర్మీలో సేవలు అందిస్తే ఎలా ఉంటుంది.. అనే పాయింట్ తో వస్తోన్న ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ నటన హైలెట్ అవుతుందనేది ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నాగ చైతన్య సైతం ఓ కీలకమైన పాత్రలోనే కనిపించబోతున్నాడు. ట్రైలర్ మోస్ట్ ప్రామిసింగ్ గా ఉండటంతో బాలీవుడ్ ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది.

ఇక లేటెస్ట్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర ట్రైలర్ సైతం మెస్మరైజింగ్ గా ఉంది. హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో హాలీవుడ్ రేంజ్ ను తలపిస్తోంది. క్రేజీ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించిన ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. �