సగిలేటి కథ ట్రైలర్ ఎలా ఉంది

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో ఒక నిజాయితీ కనిపిస్తుంది. అవి విజయం సాధించాయా లేదా అనేది తర్వాత.. కానీ ఓ హానెస్ట్ ఎటెంప్ట్ అని మాత్రం అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ అటెంప్డ్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. అప్పుడు అవి బ్లాక్ బస్టర్ అనిపించుకుంటాయి. అందుకు కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆ మధ్య వచ్చిన బలగం.

ఏ అంచనాలూ లేకుండా కేవలం తెలంగాణలోని ఓ గ్రామం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అవార్డులు గెలుచుకుంది. అలా జరుగుతుంది అని చెప్పలేం కానీ తాజాగా సగిలేటి కథ అనే సినిమా ట్రైలర్ చూస్తే వీళ్లూ నిజాయితీగా ఓ ప్రయత్నం చేశారు అనిపిస్తుంది.


ఆంధ్ర ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం.. ఆ ఊరి ఆచారాలు, మనుషుల్లోని అమాయకత్వం, పేదరికం.. అందులోనే ఓ చిన్న ప్రేమకథ.. అంతలోనే అమాయకత్వం.. అంతలోనే రౌద్రం.. వెరసి ఓ ఊరు కథగా వస్తున్నట్టు కనిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. వీళ్లు ఎంచుకున్న ప్రాంతంలోని గ్రామీణ జీవితాన్ని, అక్కడి సంప్రదాయాలను అత్యంత సహజంగా సెల్యూలాయిడ్ చేశారు అని మాత్రం తెలుస్తుందీ ట్రైలర్ చూస్తే. ఇలాంటి సినిమాలకు ఆదరణ లభిస్తే.. అన్ని ప్రాంతాల ఆచారాలు ఇలా వెండితెరపై కనిపిస్తాయి.


ఇక రాజశేఖర్ సుద్మూన్ కథ, దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించిన ఈ చిత్రానికి అశోక్ మిట్టపల్లి, దేవీ ప్రసాద్ బలివాడ నిర్మాతలు. మరి ఈ సినిమా కూడా బలగంలాగా ఎమోషన్స్ ను తట్టి లేపుతుందా లేదా అనేది చూడాలి.

Related Posts