యానిమల్ పై సందీప్ రెడ్డి వివరణ

ఒకే సినిమాతో రెండు భాషల్లో ఫేమ్ అయిన దర్శకుడు సందీర్ రెడ్డి వంగా. తెలుగులోచేసిన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డితో సంచలన విజయం సాధించాడు. అంతా దీన్ని కల్ట్ మూవీ అన్నారు. ఇదే కథను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా చేసి అక్కడా బ్లాక్ బస్టర్ కొట్టాడు.

తెలుగులో నటించిన విజయ్ దేవరకొండ టాప్ లీగ్ లోకి వెళితే.. హిందీలో నటించిన షాహిద్ కపూర్ ఫస్ట్ టైమ్ 300 కోట్ల క్లబ్ లో చేరాడు. కబీర్ సింగ్ తర్వాత సందీప్ తెలుగులో చేస్తాడు అనుకుంటే.. ఆ మూవీ ప్రొడ్యూసర్స్ అతన్ని బాలీవుడ్ లోనే ఉంచారు. రెండో సినిమాకే రణ్‌బీర్ కపూర్ ను ఇచ్చారు. రణ్ బీర్ కపూర్ తో అతను ”యానిమల్” అనే సినిమా చేస్తున్నాడు.

ఆ మధ్య వచ్చిన టీజర్ గ్లింప్స్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకున్నారు. అయితే సడెన్ గా ఆగస్ట్ నుంచి పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ కు వాయిదా వేశారు. దీంతో రకరకాల రూమర్‌స్ వచ్చాయి. వాటికి వివరణ ఇస్తూ సందీప్ ఓ వీడియో బైట్ విడుదల చేశాడు.


యానమిల్ మూవీని అత్యంత ఎమోషనల్ చిత్రంగా చెబుతున్నాడు సందీప్. ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాలనుకున్నది నిజమే.. కానీ అనుకోని కారణాలతో పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందన్నాడు. అంతా అనుకుంటున్నట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఒక్కటే కారణం కాదని.. ఈ సినిమాలో ఏడు పాటలున్నాయని.. అవన్నీ ఐదు భాషల్లో రూపొందించాలంటే 35 పాటలుగా చేయాల్సి ఉంటుంది. కాబట్టే సినిమా ఆలస్యం అవుతుందన్నాడు.

అంతేకాక.. ఈ ఐదు భాషల్లో కూడా సాహిత్య విలువలు ఒకేలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఆలస్యానికి అదీ ఓ కారణం అంటున్నాడు. బట్ ఎంత లేట్ అయినా సినిమా ప్రామిసింగ్ గా ఎంటర్టైన్ చేస్తుందనే గ్యారెంటీ ఇస్తున్నాడు సందీప్. ఫైనల్ గా ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అని తేల్చాడు. సో.. ఆగస్ట్ 11న విడుదల కావాల్సిన యానిమల్.. ఇక డిసెంబర్ 1న విడుదలవుతుందన్నమాట.

Related Posts