థర్డ్ వేవ్ తడాఖా.. మారిన రిలీజ్ డేట్స్ తో టాలీవుడ్ తంటా

కరోనా కారణంగా టాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాల రిలీజ్ లు ఆగిపోయాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ సినిమాలన్నీ ఎప్పుడు ధియేటర్లలోకి వస్తాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కానీ ఆ చిత్రాల మేకర్స్ రిలీజ్ ప్లాన్ లు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అవును ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రకారం థర్డ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన కొన్ని పెద్ద చిత్రాలకు మళ్ళీ కొత్త రిలీజ్ డేట్స్ ని లాక్ చేశారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటీ.. మారిన, మార్చుకున్న రిలీజ్ డేట్స్ ఏంటీ..?
థర్డ్ వేవ్ ప్రభావం పెరగడానికి ముందే తమ సినిమాలను రిలీజ్ చేసి సూపర్ హిట్స్ కొట్టారు కొంత మంది మేకర్స్. ఆ లిస్ట్ లో బాలయ్య అఖండ, అల్లు అర్జున్ పుష్ప, నాని శ్యామ్ సింగరాయ్ చిత్రాలున్నాయి. కానీ సంక్రాంతి టార్గెట్ గా ప్లాన్ చేసుకున్న పాన్ ఇండియా చిత్రాలతో పాటు మరో భారీ చిత్రం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా వెనక్కి తగ్గక తప్పలేదు. దీంతో అలా వాయిదా పడిన చిత్రాలకు మళ్ళీ కొత్త రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకుంటున్నారు.
ఖచ్చితంగా సంక్రాంతికే రావాలని పట్టుబట్టిన భీమ్లా నాయక్ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్, రాదేశ్యామ్ కారణంగా ఫిబ్రవరి 25కి పోస్ట్ పోన్ చేశారు. కానీ కోవిడ్ కోసులు పెరగడంతో సంక్రాంతికి రావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25కే రిలీజ్ చేస్తామని సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లోనూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ అది థర్డ్ వేవ్ లో కేసులు ఇంకా పెరిగితే భీమ్లా నాయక్ ని మళ్ళీ వాయిదా వేయక తప్పదు.
సంక్రాంతి సినిమాలతో పోటీ పడటం ఇష్టం లేక… మెగాస్టార్ చిరంజీవి ముందుగానే తమ సినిమా ఆచార్యని ఫిబ్రవరి 4కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ టైమ్ కి ఆచార్యని రిలీజ్ చేయడం కుదరనిపిని. అందుకే మేకర్స్ కూడా ఆచార్యని ఏప్రల్ కి పోస్ట్ పోన్ చేసినట్లు సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. అంటే కొరటలా శివ, చిరంజీవి, రా�