మంగ్లీ (సత్యవతి)…. ఫోక్ సింగరే కాదు.. స్టార్ సింగర్..

మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

• జననం అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండ
• జాతీయత భారతీయురాలు
• వృత్తి న్యూస్ ప్రజెంటర్, వ్యాఖ్యాత,నటి
• క్రియాశీల సంవత్సరాలు 2014 -ప్రస్తుతం
• బంధువులు ఇంద్రావతి చౌహాన్ (చెల్లెలు)

జననం, బాల్యం
మంగ్లీ అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండలోనే 5వ తరగతి చదివింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. RDT (Rural Development Trust) సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్. వీ. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది.

జీవిత విశేషాలు
ఆమె జీవితం మలుపు తిప్పింది మాత్రం RDT సంస్థనే. RDT చొరవతో సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది. అయితే మంగ్లీ యాస భాష చూసి తను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అనుకుంటారు.

మంగ్లీ గా
ఒకసారి V6 టీవీ చానెల్ లో జానపద కార్యక్రమం జరుగుతుంటే బిక్షు నాయక్ అనే జానపద గాయకుడు అక్కడికి పంపించాడు. ఆ కార్యక్రమం �