పొన్నియన్ సెల్వన్ -2

రివ్యూ : పొన్నియన్ సెల్వన్ -2
తారాగణం : విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, కార్తి, శోభిత ధూళిపాల, ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, జయరాం తదితరులు
ఎడిటింగ్ : ఏ శ్రీకర్ ప్రసాద్
సంగీతం : ఏఆర్ రెహ్మాన్
ప్రొడ్యూసర్స్ : మణిరత్నం, సుభాస్కరన్
దర్శకత్వం : మణిరత్నం

తమిళీయులకు అత్యంత ఇష్టమైన చోళుల పరిపాలన. దానిని వారు స్వర్ణయుగం అని చెప్పుకుంటారు. ఇప్పటికీ తమిళనాట కనిపించే ఎన్నో దేవాలయాలు చోళులు కట్టించినవే. చోళ రాజులను ఆరాధిస్తారు కూడా. ఆ నేపథ్యంలో వచ్చే రచనలైనా, కథలైనా, సినిమాలైనా అత్యంతగా ఆదరిస్తారు. కాకపోతే అవి ఇతర భాషల్లోనే కాస్త కష్టంగా ఉంటాయి. అయినా దర్శకుడు మణిరత్నం కాబట్టి, ఆరిస్టులు బాగా తెలిసిన వాళ్లు కాబట్టి అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ ఇతర భాషల్లో ఆకట్టుకోలేకపోయినా.. తమిళ్ లో మాత్రం అదరగొట్టింది. ఓవర్శీస్ లో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ విడుదల చేశారు. అంచనాలేవీ లేకుండా వచ్చిన ఈ పొన్నియన్ సెల్వన్ 2 ఎలా ఉందో చూద్దాం. మొదటి భాగం చూడని వారికి ఈ భాగం అర్థం కాదు.

కథ :
రాజ్య విస్తరణలో భాగంగా పలు దేశాలపై దండెత్తుతూ వెళ్లిన అరుణ్ మొళి(జయం రవి) సొంత మనుషుల కుట్రవల్లే హత్య ప్రయత్నానికి గురవుతాడు. అతను సముద్రంలో మునిగిపోతుండగా ఓ వృద్ధమహిళ వచ్చి కాపాడుతుంది. అక్కడి నుంచి మొదలైన ఈ రెండో భాగంలో ముందుగా ఆదిత్య కరికాలుడు(విక్రమ్) నందిని(ఐశ్వర్య) మధ్య టీనేజ్ లో సాగే ప్రేమకథతో మొదలవుతుంది. వీరి మధ్య అంత శతృత్వాన్ని ఫస్ట్ పార్ట్ లో చూసిన వారికి ఈ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కానీ ఓ అనాథను రాణిని చేయడానికి అంగీకరించని కరికాలుడి తల్లి ఆమెను ఊరి నుంచి తరిమేస్తుంది. పాండ్యుల పంచన చేరుతుంది. అయితే పాండ్యులు చోళులకు బద్ధ శతృవులు కాబట్టి.. నందిని ఒద్దని వ�