ఇండియన్ సినిమాకు ఇప్పటి వరకూ ఎన్ని ఆస్కార్స్ వచ్చాయో తెలుసా..?

95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ఇండియన్ సినిమా.. లేదూ మనవరకూ గర్వంగా చెప్పుకోవాలంటే మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ వచ్చేసింది. చాలాకాలం తర్వాత ఇండియాను వరించిన ఆస్కార్ కావడంతో దేశమంతా సంబురాల్లో మునిగిపోయింది. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ నుంచి ఊపిరి సలపని ప్రశంసలు వస్తున్నాయి.

దీంతో పాటు ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’అనే డాక్యుమెంటరీకి కూడా షార్ట్ ఫిల్మ్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ అవార్డ్ వచ్చేసింది. ఇలా ఒకే యేడాది రెండు ఆస్కార్ లు రావడం మన దేశానికి రావడం ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. అయితే ప్రపంచం అంతా చాలా గొప్పగా చెప్పుకునే ఆస్కార్ అవార్డ్స్ ఇప్పటి వరకూ మన ఇండియాకు ఎన్ని వచ్చాయి.. ఏ ఏ విభాగాల్లో వచ్చాయి అనేది చూస్తే.. నిజంగా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది. ఎందుకంటే ఇదేమీ మనకు అందని ద్రాక్ష కాదు అని గతంలో అవార్డ్స్ సాధించిన వారిని చూస్తే అర్థమౌతుంది.


1983లో మన దేశానికి మొదటి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. అటెన్ బరో తీసిన గాంధీ చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగంలో భాను అథైయా ఈ అకాడెమీ అవార్డ్ ను సాధించారు. ఆమెతో పాటు ఈ అవార్డ్ ను ఇంగ్లండ్ కు చెందిన జాన్ మోలో కూడా ఈ అవార్డ్ ను షేర్ చేసుకున్నారు. ఇక 1992లో తన ఎంటైర్ కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ అందించినందుకు గానూ ది గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ �