నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ తెస్తోన్న రైటర్

కటౌట్ ఉన్నవాడికి కంటెంట్ తక్కువగా ఉన్నా కమర్షియల్ గా మరీ లాస్ లు రావు. ఇక కంటెంట్ బలంగా ఉన్నోడికి కటౌట్ లేకుంటే ఖచ్చితంగా కాసులు రాలతాయి. ఈ విషయం ఇప్పటికే చాలా చిన్న సినిమాలు ప్రూవ్ చేశాయి. లేటెస్ట్ గా వచ్చిన మరో సినిమా కూడా నిరూపించింది. బలమైన తారాగణం లేదు. పెద్ద బ్యానర్ కాదు. ఇతర కాస్టింగ్ సైతం స్టార్స్ కాదు. అంతెందుకు టెక్నీషియన్స్ సైతం మీడియం రేంజ్‌ వారే. అయినా సినిమాను చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేసుకున్నారు.. పక్కా హిట్ అందుకున్నారు. ఎంత అంటే పెట్టుబడికి డబుల్ లాభాలు తెస్తోందీ చిత్రం. మరి ఆ చిన్న సినిమా రైటర్ పద్మభూషణ్.


షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు వచ్చి.. అతి తక్కువ టైమ్ లోనే నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు సుహాస్. ఫ్రెండ్ గా, ఇతర పాత్రల్లోనూ సత్తా చాటుతూ.. తనదైన దారిలో దూసుకుపోతున్నాడు. టాలెంటెడ్ అని షార్ట్ ఫిల్మ్స్ లోనే అనిపించుకున్నాడు కాబట్టి.. వెండితెరపైనా ఎలాంటి పాత్రైనా అలవోకగా ఆకట్టుకుంటున్నాడు. ఆ మధ్య వచ్చి హిట్ 2 మూవీలో విలన్ గా అదరగొట్టాడు. అంతకు ముందు కరోనా టైమ్లో వచ్చిన కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. కానీ ఈ చిత్రం కేవలం ఓటిటిల్లోనే రావడంతో అతని టాలెంట్ అంతగా తెలియలేదు. హీరోగానూ రాణించగలను అని కలర్ ఫోటోతోనే నిరూపించుకున్నాడు.

అలాగని రెగ్యులర్ హీరో కాదు.. ఒకప్పుడు మనకు చంద్రమోహన్, మురళీ మోహన్ వంటి వారు తీసిన తరహా చిత్రాలకు బాగా సూట్ అవుతాడు. పైగా తన కలర్ పైనా సెటైర్స్ ఉన్నా ఇబ్బంది లేదంటున్నాడు. సో.. అతను హీరోగా కొత్తగా వస్తోన్న కుర్రాళ్లు కథలు రాసుకోవడంలో ఆశ్చర్యమేం ఉంది. అలా వచ్చిందే రైటర్ పద్మభూషణ్. షన్ముఖ్ ప్రశాంత్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని ముందు నుంచీ చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ కు ముందే రెండు రాష్ట్రాల్లోన�