లక్కీ లక్ష్మణ్ సినిమా రివ్యూ

తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో… బిగ్ బాస్ ద్వారా ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సోహైల్… సామాజిక సేవా కార్య‌క్ర‌మాల ద్వారా కూడా ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌గా ద‌గ్గ‌రయ్యారు. ఈయ‌న హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. బిగ్ బాస్ కంటే ముందు సీరియల్స్‌లో న‌టించి మెప్పించిన సోహైల్‌కు యాక్టింగ్ కొత్తేమీ కాదు. అయితే సిల్వ‌ర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం కొత్త‌దే. మ‌రి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌గా సోహైల్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారా? నిజంగానే సోహైల్ ల‌క్కీయేనా? అస‌లు ఈ సినిమా ద్వారా త‌నేం చెప్పాల‌నుకున్నారు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ముందు సినిమా చూడాల్సిందే…!!!

కథ: ల‌క్ష్మ‌ణ్ అలియాస్ ల‌క్కీ (సోహైల్‌) తండ్రి వెంక‌టేశ్వ‌ర‌రావు(దేవీ ప్ర‌సాద్ దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన వ్య‌క్తి. చిన్న‌ప్ప‌టి నుంచి ల‌క్కీ త‌ల్లిదండ్రుల‌ను ఏమ‌డిగినా త‌మ వ‌ద్ద డ‌బ్బులేదంటుంట