యశోద నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రెస్ మీట్

సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘యశోద’. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ‘ఈవా’ పేరు ఉపయోగించడంతో హైదరాబాద్‌లో ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వెళ్ళాయి. వాళ్ళతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించారు. సినిమాలో ‘ఈవా’ పేరును తొలగించినట్టు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కావడంతో ‘ఈవా ఐవీఎఫ్’ ఎండీ మోహన్ రావుతో కలిసి మంగళవారం శివలెంక కృష్ణప్రసాద్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.

శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మించిన ‘యశోద’ విజయవంతమైన సంగతి తెలిసిందే. సినిమాలో మేం సరోగసీ ఫెసిలిటీ అని చూపించాం. దానికి ‘ఈవా’ అని పేరు పెట్టాం. దానికి మేం ఇచ్చిన నిర్వచనం వేరు. అయితే, హైదరాబాద్ – వరంగల్‌కు చెందిన ‘ఈవా ఐవీఎఫ్’ ఫెర్టిలిటీ ఆసుపత్రి వారు సినిమా అనేది పవర్ ఫుల్ మీడియం కావడంతో… ‘యశోద’లో ఈవా అని చూపించడంతో తమకు ఇబ్బంది కలుగుతుందని కోర్టు ద్వారా న్యాయం కోసం ప్రయత్నించారు. థియేటర్లలో క