Advertisement
జాతిరత్నం భామకు జబర్దస్త్ ఆఫర్
Latest Movies Tollywood

జాతిరత్నం భామకు జబర్దస్త్ ఆఫర్

Advertisement

జాతిరత్నం సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఫస్ట్ మూవీ అయినా తన నటనకు అందా ఫిదా అయ్యారు. అయితే ఈ భామ చాలా హైటు. దీంతో ఫేమ్ వచ్చింది కానీ ఆ రేంజ్ లో ఆఫర్స్ రాలేదు. అందుకు కారణం తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న చాలామంది హీరోలు పొట్టివారే. వారి ముందు ఫరియా చాలా ఎత్తులో కనిపిస్తుంది. ఈ కారణంగానే తనకు వెంటనే ఛాన్స్ లు రాలేదు. అయితే రీసెంట్ గా నాగార్జున బంగార్రాజు చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ పట్టేసింది. నువ్వు పెళ్లిజేసుకెళ్లిపోతే బంగార్రాజు మాకింకెవ్వడు కొనిపెడతడు కోకా బ్లౌజూ అంటూ సాగే ఆ పాటలో ఫరియా స్టెప్పులు కూడా అదిరిపోయాయి అంటున్నారు. పైగా తను మంచి డ్యాన్సర్. సోషల్ మీడియాలో తను వేసే స్టెప్పులు చూసి చాలామంది నోరెళ్లబెట్టే ఎమోజీలు పెట్టేస్తారు.
ఐటమ్ సాంగ్ కు ముందే తనకు హీరోయిన్ గా ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. అదీ మాస్ రాజా రవితేజ సినిమాలో. సుధీర్ వర్మ డైరెక్షన్ లో రూపొందే రావణాసుర చిత్రంలో ఫరియా ఓ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే లేటెస్ట్ గా తనకు మరో జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందబోతోన్న ఈ చిత్రంలో లేటెస్ట్ యంగ్ స్టర్ సంతోష్ శోభన్ హీరో కావడం విశేషం. సంతోష్ రీసెంట్ గా ఏక్ మినీ కథతో ఫామ్ లోకి వచ్చాడు. అటు మేర్లపాక ప్రస్తుతం కొంత స్ట్రగుల్ లో ఉన్నాడు. అలాంటి వారి కాంబోలో సినిమా అంటే ఖచ్చితంగా కాస్త బలమైన కంటెంట్ ఉంటేనే కమిట్ అవుతారు కదా.. సో ఇది ఫరియాకు మంచి అవకాశం అనే చెప్పాలి. కాస్త మెల్లగా మొదలైన ఫరియా హవా ఇంకా పెరుగుతుందేమో..

Advertisement