ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత పెరిగిన ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను కాపాడుకునేందుకు వరుస ప్రాజెక్ట్స్ తో వస్తున్నాడు. ఆల్రెడీ రీసెంట్ గా తన బర్త్ డే రోజునే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేశాడు. అందులో ముందుగా వస్తోన్న చిత్రం కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్నది. ఇంతకు ముందు ఈ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయింది. అయితే కొరటాల రీసెంట్ మూవీ ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలవడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కాస్త భయం ఉన్నా.. యంగ్ టైగర్ మాత్రం కొరటాలపై నమ్మకం ఉంచాడు. ఇప్పటి వరకూ కొరటాల శివ సినిమా అంటే మాస్ తో పాటు మెసేజ్ కూడా ఉండేది. కానీ ఈసారి మెసేజ్ ల్లాంటివేం లేకుండా డైరెక్ట్ గా ఊరమాస్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు అని చెబుతున్నారు.ఇంకా చెబితే ఈ రేంజ్ మాస్ ఎంటర్టైనర్ ను ఇప్పటి వరకూ కొరటాల తీయలేదు అంటున్నారు. అటు ఎన్టీఆర్ కూడా ఇలాంటి సినిమా చేసి చాలా రోజులవుతోంది. అందుకే ఈ మూవీపై అంచనాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తంగా క్రేజీ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. అఫీషియల్ కాదు కానీ.. అదే డేట్ కన్ఫార్మ్ అనేది ఇన్ సైడ్ మూవీ టీమ్ చెబుతోన్న మాట. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వస్తోన్న చిత్రాన్ని వచ్చే యేడాది యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేస్తారట. అంటే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. అయితే అంతకు ఒకరోజు ముందే మే 19న ఈ మూవీని విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు. మాస్ ఎంటర్టైనర్ కాబట్టి ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయితే పెద్దగా సమస్యలేం ఉండవు. అంటే గ్రాఫిక్స్,విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కువ రోజులు పని ఉండదు కదా.. అందుకే కంటిన్యూస్ గా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న టైమ్ కు మే 19న ఎట్టి పరిస్థితులలోనూ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారని టాక్. సో.. యంగ్ టైగర్ బర్త్ డే రోజునే ఈ బ్లాస్టింగ్ మూవీ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతోందన్నమాట.

, , , , , ,