Advertisement
ఎన్ని జన్మలైనా నువ్వే నా అన్నయ్య – మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్
Latest Movies Tollywood

ఎన్ని జన్మలైనా నువ్వే నా అన్నయ్య – మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

Advertisement

అన్నయ్య రమేష్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మహేష్ బాబు. తానొక సూపర్ స్టార్ గా ఎదగడంలో అన్నయ్య ఇచ్చిన స్ఫూర్తి మర్చిపోలేనిదని మహేష్ పేర్కొన్నారు. ఇక విశ్రాంతి తీసుకో అన్నయ్య అంటూ ట్వీట్ చేసిన మహేష్…ఇంకో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య అంటూ భావోద్వేగపూరితంగా స్పందించారు.

 

నాకు స్ఫూర్తినిచ్చావు, నాకు ధైర్యాన్నిచ్చావు, నాకు బలాన్నిచ్చావు, నాకు సర్వస్వం అయ్యావు..నువ్వు లేకుంటే ఇవాళ నేనీ స్థాయిలో ఉండేవాడిని కాదు. నాకు అందించిన ప్రతి సపోర్ట్ కు కృతజ్ఞతలు అన్నయ్య. ఇక ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకో. ఈ జన్మే కాదు ఇంకో జన్మంటూ ఉంటే నువ్వే నాకు అన్నయ్య. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు మహేష్ బాబు.

 

Advertisement