ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో మోస్ట్ అవెయిటెడ్ షో గా ఉన్న అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ వచ్చేసింది. అయితే స్ట్రీమింగ్ మొదలైన అరగంటకే ఓటిటి ప్లాట్ ఫామ్ క్లాష్ అయింది. ఈ షోకు ఎంత డిమాండ్ ఉందో అందరికంటే ఎక్కువగా ఆహా టీమ్ కే తెలుసు. అయినా ఆ మేరకు వ్యూయింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేయకుండా వదిలేశారు. ఇంకా చెబితే వారి షో గురించి వారికే ఏ మాత్రం అవగాహన, అంచనా లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి ఏర్పాటు చేయకపోవడం వల్ల.. ఈ షోను ఊహించినదానికంటే చాలా చాలా ఎక్కువమంది చూడడానికి రావడంతో మొత్తం షో క్లాష్ అయింది. ఇది పూర్తిగా ఆహా వారి టెక్నికల్ టీమ్ తప్పిదం. ఆ తప్పిదాన్పి కప్పి పుచ్చుకుంటూ నెపం మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ పై వేసి చేతులు దులుపుకుందాం అని చూశారు. కానీ ఈ ప్రాబ్లమ్ కు కారణం ఏంటో అందరికీ తెలుసు కదా.. అందుకే ఇప్పుడు అంతా ఆహా టీమ్ ను తెగ తిడుతున్నారు.


ముఖ్యంగా ఇలాంటి ప్లాట్ ఫామ్స్ లో టెక్నికల్ ఇష్యూస్ రావడం కామన్. కానీ ఏ రకంగా వస్తాయి అనే అంచనా ఆ టెక్నికల్ టీమ్ కు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. వారికి ఉందో లేదో కానీ.. షో మొత్తం క్లాష్ అయింది. ఈ తప్పు తమదే అని ఒప్పుకోకపోగా సింపుల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా చూడటం వల్లే ఇలా అయింది నింద మొత్తం వారిమీద వేస్తుండటం వివాదానికి కారణమైంది. విశేషం ఏంటంటే.. సంఘటన జరిగి ఇన్ని గంటలవుతున్నా.. ఇంకా దాన్ని రెక్టిఫై చేసుకోకపోగా ఇప్పటికీ ప్రభాస్ ఫ్యాన్సే కారణం అని చెబుతున్నారు.


ఇంత పెద్ద ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అందుకు తగ్గ టెక్నికల్ టీమ్ ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ టైమ్ ఎక్కువమంది చూడగానే క్లాష్ అయిపోయే ప్లాట్ ఫామ్ పై జనానికి నమ్మకం పోతుంది. దానికంటే ముందు తప్పు ఒప్పుకోకపోవడం అనే విషయం ఇంకా పెద్ద విషయంగా చూస్తారు. ఏదేమైనా అరవింద్ గారూ.. అన్నీ సినిమాల్లాగా మేనేజ్ చేయలేరండీ.. టెక్నాలజీ పరంగా జనం ఎప్పుడో అప్డేట్ అయిపోయారు. అంచేత.. మీరు మీ టీమ్ తప్పును ఒప్పుకోకపోయినా.. నిజమేంటో అందరికీ తెలుసు. సో దయచేసి విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ పై నెట్టేయకండి.

, , , , , , ,