ad

ఏ స్టార్ అయినా మాస్ హీరో అనిపించుకోవాలిన ఆరాటపడుతుంటాడు. మాస్ ను రీచ్ అయితే రేంజ్ పెరుగుతుంది. ఇమేజ్ మారుతుంది. అందుకే చిన్నా చితకా హీరోలు కూడా మాస్ మంత్రం జపిస్తుంటారు. ఈ విషయంలో కాస్త వెనకబడి ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకుని మాస్ లీగ్ లోకి ఎంటర్ అయ్యాడు. దాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు అతను వారియర్ లా మారాడు. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే రామ్ కు మాస్ లో క్రేజ్ పెరిగేలానే ఉందంటున్నారు. మరి అతని రేంజ్ కూడా మారుతుందా ..?ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు రామ్. కానీ ఆ జోష్‌ కంటిన్యూ చేస్తాడు అనుకుంటే వెంటనే రెడ్ లైట్ పడింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నా ఈ సారి పర్ఫక్ట్ ఎంటర్టైనర్ తోనే వస్తున్నాడని ది వారియర్ మూవీ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. నిజానికి ఈ ట్రైలర్ చూస్తోంటే ఇది రామ్ ఇమేజ్ కు మించిన భారం అనిపించక మానదు. కానీ కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఇమేజ్ ను దాటి ఆడియన్స్ ను మెప్పించొచ్చు. ఆ ప్రయత్నంలో ది వారియర్ మూవీ టీమ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ కటౌట్ కు దృష్టిలో పెట్టుకుని సగ భాగం విలన్ కూ కేటాయించారు. అంటే కేవలం రామ్ మాత్రమే ఈ కథను మోయక్కర్లేదు. నెగెటివ్ షేడ్ అయినా ఆ వైపు నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఉంటే ఎన్ కౌంటర్ మాసివ్ గా చూపించొచ్చు. అది రామ్ కు ఎలివేషన్ అవుతుంది. అందుకే అతని పాత్రను కూడా ఓ రేంజ్ లో డిజైన్ చేశారనిపిస్తోంది.కొన్నాళ్ల క్రితం తమిళ్ లో టాప్ డైరెక్టర్ అనిపించుకున్నా.. తర్వాత ఆ ట్యాగ్ ను కోల్పోయిన దర్శకుడు లింగుస్వామి..

చాలామంది తమిళ్ హీరోల చుట్టూ తిరిగి చివరికి తెలుగుకు వచ్చాడు. ఆ మధ్య ఇదే కథతో అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడు అనే టాక్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ చాలాకాలం వెయిట్ చేయించి అతనూ హ్యాండ్ ఇచ్చాడు. ఇటు ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ను మెప్పించగలను అని ప్రూవ్ చేసుకున్నాడు రామ్. దీంతో లింగుస్వామికి రామ్ కూడా ఓ మంచి ఆప్షన్ లా కనిపించాడు. ఇటు రామ్ కూడా ఇలాంటి కథ కోసమే చూస్తున్నాడు. ఇంకేముందీ.. కాంబినేషన్ సెట్ అయింది. మొదట్లో వీరి కాంబో గురించి కొన్ని కమెంట్స్ వచ్చాయి. కానీ ట్రైలర్ తర్వాత ఆ కమెంట్స్ ఆగిపోతాయని వేరే చెప్పక్కర్లేదు.రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ రోల్ కు ఆది పినిశెట్టి అద్భుతంగా ఫిట్ అయ్యాడు. ఆది పాత్రపైనా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. నదియా మరో కీలక పాత్ర పోషించిన ది వారియర్ లో రామ్ కు ఏదో డిజార్డర్ కూడా ఉంటుందని రూమర్స్ వచ్చాయి. అది నిజమే అనేలా ట్రైలర్ ఫినిషింగ్ కనిపిస్తోంది. మొత్తంగా ఓ పెద్ద హీరో చేయాల్సిన రేంజ్ పాత్రలా కనిపిస్తోంది. మరి రామ్ ఏ మేరకు నిలబెడతాడో కానీ.. ఒకవేళ హిట్ కొడితే రామ్ రేంజ్ కూడా మారుతుందని చెప్పొచ్చు.తెలుగుతో పాటు తమిళ్ లోనూ రిలీజ్ కాబోతోన్న ది వారియర్ ఈ నెల 14న విడుదల కాబోతోంది.

, , ,