ఈ పిల్లకు హిట్ వస్తుందా అనే టైటిల్ తో సినిమా చేస్టే ఆ టైటిల్ కు హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ ఇచ్చే బ్యూటీస్ చాలామందే ఉన్నారు ఇప్పుడు. అయితే అందంతో పాటు అది ప్రదర్శించే లౌక్యం కూడా ఉన్న భామలకు హిట్స్ రాకపోతే వారి టాలెంట్ అంతా ఫ్లాప్ ల మాటునే దాగిపోతాయి. అలా ఉండిపోతోన్న లేటెస్ట్ సోయగం కేతికా శర్మ. అమ్మడు ఇప్పుడున్న చాలామంది భామలకంటే ఎక్కువ టాలెంటే ఉందంటారు. ప్రతిభ ఉన్నా పాపకు విజయం అందని ద్రాక్షే అవుతోంది. ఇంతకీ తన కెరీర్ రంగరంగ వైభవంగా వెలిగేదెన్నడో కానీ.. సోషల్ మీడియాలో హాట్ హాట్ గా హల్చల్ చేసే యంగ్ బ్యూటీస్ లో కేతిక శర్మకు కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. టాలీవుడ్ లో జెండా ఎగరేయాలని ఢిల్లీ నుంచి దిగిప ఈ బ్యూటీకి తెలుగులో రొమాంటిక్ వెల్కమ్ దొరికింది. ఈ సినిమాలో తనే హైలెట్. ఇంకా చెబితే ఈ మూవీ కాస్త కమర్షియల్ గా గట్టెక్కిందంటే కారణం కేతికా శర్మనే. ఆ రేంజ్ లో యూత్ ను ఫిదా చేసింది.

అయితే ఆ తర్వాత నాగశౌర్యతో చేసిన లక్ష్య మాత్రం అమ్మడి లక్ష్యానికి దూరంగా వెళ్లింది. ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా తన పాత్ర కూడా అంత ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో ఫస్ట్ మూవీతో బెస్ట్ ఇంప్రెషన్ వేసినా.. నెక్ట్స్ పిక్చర్ కే డిఫెన్స్ లో పడిపోయింది.లేటెస్ట్ గా వచ్చిన రంగరంగ వైభవంగా పై చాలా ఆశలే పెట్టుకుంది కేతిక శర్మ. ఈ మూవీ విడుదలకు ముందు పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకుంది. పాటలు బావున్నాయి. అందులో మరోసారి కేతిక హైలెట్ గా కనిపించింది.

బట్ కంటెంట్ లోపంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా తేలింది. అయితే ఈ సినిమాలో నటిగా తన ప్రతిభ చాలామందికి నచ్చింది. కేవలం గ్లామర్ పాత్రల్లోనే కాదు.. నటనక ప్రాధాన్యం పాత్రల్లోనూఆకట్టుకోగలదు అని నిరూపించుకుంది. నిజానికి రంగరంగ వైభవంగా తర్వాత కంటిన్యూస్ గా మెగా క్యాంప్ లోనే సినిమాలు చేస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. ఈ క్యాంప్ సంగతేమో కానీ.. అసలు వేరే సినిమాల విషయంలోనూ ప్రస్తుతం సందిగ్ధం కనిపిస్తోంది. ఏదేమైనా ఈ సందిగ్ధం త్వరలోనే తొలగిపోయి ఈ రొమాంటిక్ బ్యూటీకి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ దక్కుతుందేమో చూడాలి.

, , ,