పొయొటిక్ సెన్స్ ఉన్న దర్శకులు తెలుగులో మొదటి నుంచీ తక్కువే. జెనరేషన్ ఒకరో ఇద్దరో కనిపిస్తారు. ఈ జెనరేషన్ లో అలాంటి దర్శకుడుగా ఇంద్రగంటి మోహనకృష్ణను చెప్పొచ్చు. కంటెంట్ ఏదైనా కాన్ ఫ్లిక్ట్ ను కాస్త నేచురల్ గా చెబుతాడు. మెలోడ్రామా తక్కువగా ఉంటుంది. అందుకే అతనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ బేస్ టార్గెట్ గానే ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ వస్తున్నాడు. ఈ శుక్రవారం విడుదల కాబోతోన్న ఈ మూవీ అటు సుధీర్ బాబుకీ కీలకమే. మరి వీరి ఆశలను, ఆడియన్స్ అంచనాలను ఈ మూవీ నెరవేరుస్తుందా..?

ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే భావన ఉంది. అలాగని ఆయనవీ మరీ భారీ సినిమాలు కాదు. మీడియం రేంజ్ మూవీస్ తోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంటాడు. అందుకు తగ్గ హీరోలతోనే ట్రావెల్ అవుతుంటాడు. ఆ మధ్య వరుస విజయాలు సాధించినా.. చివరగా వచ్చిన ‘వి’ అనే మూవీ ఆ మొత్తం ఇంప్రెషన్ ను పోగొట్టింది. అంతకు ముందు సుధీర్ బాబుతో చేసిన సమ్మోహనం వంటి బ్యూటీఫుల్ మూవీ ఇంపాక్ట్ కూడా వి వల్ల పోయింది. ఆ ఇంప్రెషన్ ను మళ్లీ సంపాదించాలంటే ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. ఇటు సుధీర్ బాబు కూడా వి తో పాటు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో నెగెటివ్ రిజల్ట్ చూసి ఉన్నాడు. సో అతనికీ ఈ చిత్ర విజయం కీలకంగా మారిందిప్పుడు.

ఆ అమ్మాయి పాత్రలో కృతిశెట్టి నటించిన ఈ మూవీ ఓ సినిమా దర్శకుడు, డాక్టర్ అమ్మాయికి మధ్య సాగే కథ. ఈ ఇద్దరి మధ్యలో ఆ అమ్మాయి ఫ్యామిలీకి సంబంధించిన కథ ఎమోషన్స్ ను నింపుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మొదటి నుంచీ ఈ మూవీకి అంతా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ బావున్నాయి. పాటలు మెలోడియస్ గా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలు, దర్శకులు ఈ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఒక్కోసారి విషయం వీక్ గా ఉంటేనే ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. లేదా ఓ మంచి కథ ఎక్కువమందికి తెలియాలి అన్నప్పుడు ఇలా ఇండస్ట్రీ వాళ్లే ముందుకు వస్తారు. ఈ సినిమా మొదటి కోవకు చెందిందా లేక రెండో కోవకు చెందిందా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.

, , , , ,