Advertisement
ఏజెంట్ 100 కోట్లు మార్క్ అందుకుంటాడా..?
Latest Movies Tollywood

ఏజెంట్ 100 కోట్లు మార్క్ అందుకుంటాడా..?

Advertisement

అక్కినేని అఖిల్ న‌టించిన అఖిల్, హాలో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేదు. అయితే… అఖిల్ పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అభిమానుల‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ మూవీ స‌క్స‌స్ అందించింది. ద‌స‌రాకి వ‌చ్చిన ఈ సినిమా అఖిల్ కి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విజ‌యాన్ని అందివ్వ‌డంతో రెట్టించిన ఉత్సాహంతో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాని స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

భారీ థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మ‌ల‌య‌ళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల అఖిల్, మమ్ముట్టిల పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఈరోజు ఏజెంట్ మూవీ ఆగ‌ష్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టుగా మేక‌ర్స్ అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించారు. అంతే కాకుండా ఈ మూవీ నుంచి ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో అఖిల్ గ‌న్ ప‌ట్టుకుని చాలా స్టైలీష్ గా క‌నిపించాడు. ఈ పోస్ట‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది.

Image

అక్కినేని అభిమానులు అయితే.. ఈ సినిమాతో అఖిల్ 100 కోట్లు సాధించ‌డం ఖాయం అంటున్నారు. ఆమ‌ధ్య సురేంద‌ర్ రెడ్డి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ మూవీ గురించి మాట్లాడుతూ… అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ మూవీతో స‌క్స‌స్ సాధించాడు. ఏజెంట్ మూవీతో స్టార్ హీరోగా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌బోతున్నాడు. అంత‌కు మించి ఏమీ చెప్ప‌లేను అంటూ ఏజెంట్ మూవీ ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో అనేది హింట్ ఇచ్చాడు సురంద‌ర్ రెడ్డి. మొత్తానికి చూస్తుంటే.. ఏజెంట్ మూవీతో అఖిల్ 100 కోట్ల మార్క్ అందుకుంటాడు… స్టార్ హీరోగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడు అనిపిస్తుంది. అయితే… ఏజెంట్ ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తాడో తెలియాలంటే ఆగ‌ష్టు 12 వ‌ర‌కు ఆగాల్సిందే.

Advertisement