Advertisement
సమంత, చైతన్య మళ్లీ కలవడమా..? నెవర్..
Latest Movies Tollywood

సమంత, చైతన్య మళ్లీ కలవడమా..? నెవర్..

Advertisement

అత్యుత్సాహం అన్నిటికీ సరైంది కాదు. ఇంకా చెబితే దేనికీ సరైంది కాదు. వాస్తవం తెలుసుకోకుండా తోచింది రాస్తే సరిపోదు కదా..? ఇప్పటికే నాగచైతన్య, సమంత విడాకులుకు సంబంధించి సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఆ ఇద్దరూ మాత్రం హ్యాపీగా ఎవరి పని వారు చూసుకుంటూ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఇద్దరూ ‘మానసికంగా’ పూర్తిగా విడిపోయినట్టే కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ ఈ ఇద్దరూ కలవబోతున్నారు అనే న్యూస్ ప్రస్తుతం నెట్టిళ్లలో హల్చల్ చేస్తోంది. మరి ఇందులో నిజమెంత అంటే.. అస్సలు లేదు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు.
సమంత, చైతన్య విడిపోవడానికి ముందే అనేక మీటింగ్స్ జరిగాయి. ఇద్దరి పెద్దలూ, స్నేహితులూ మాట్లాడారు. బాగా కావాల్సిన వారి నుంచి కౌన్సెలింగ్స్ కూడా అయ్యాయి. అయినా సెపరేషన్ కే మొగ్గు చూపారు. అంటే విడిపోవడానికి వీళ్లు దాదాపు యేడాది కిందటే మానసికంగా సిద్ధమయ్యారు. అలాంటిది మళ్లీ ఎలా కలుస్తారు.. అంటే దీనికి కొందరు చెబుతోన్న రీజన్.. సమంత.. తన ఇన్ స్టాగ్రామ్ లో తమ విడాకులుకు సంబంధించిన పోస్ట్ డిలీట్ చేసింది. కాబట్టి మళ్లీ కలవబోతున్నారు అనే సెన్స్ లెస్ లాజిక్ ఒకటి తీస్తున్నారు.
కానీ తరచి చూస్తే.. విడాకులు అయిపోయింది కదా.. ఇంక ఆ ప్రకటన మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో ఎందుకు..? అని సమంత తీసేసింది అనుకోవచ్చు. పైగా తను చైతూతో కలిసి ఉన్న అన్ని ఫోటోస్ డిలీట్ చేసింది. అంటే అతని జ్ఞాపకాలేవీ తనతో ఉంచుకోవడం లేదు. సో.. ఈ విడాకులు పోస్ట్ కూడా ఓ రకంగా చైతూ జ్ఞాపకమే కదా..? అందువల్ల అతని జ్ఞాపకాలను మూలాలతో సహా తొలగించుకుంటోందన్నమాట. చే అనే పేరు తన లైఫ్ లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా వినిపించకూడదనే తను ఇలా ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది.
పోనీ ఒకవేళ వీళ్లు చెబుతున్నదే నిజం అనుకుని.. సమంత విడాకులు పోస్ట్ డిలీట్ చేసింది కాబట్టి.. మళ్లీ కలుస్తున్నారు అనుకుందాం.. మరి చైతన్య డిలీట్ చేయలేదు కదా.. మరి దానర్థం ఏంటీ..? చైతూ విడాకులుకే కట్టుబడి ఉన్నాడనా..? అంచేత.. అత్యుత్సాహానికి పోయి.. ఏదో ఒకటి కదా రాసేస్తే ఉపయోగం ఉండదు బాస్.. కొంతైనా లాజిక్ ఉండాలి. సో ఫైనల్ గా .. సమంత చైతూ మెమరీస్ ను సమూలంగా తుడిచేస్తోందే తప్ప.. కలిసే ఉద్దేశ్యాలేం లేవక్కడ.. అర్థమైందా..?

Advertisement