కొన్నాళ్లుగా అన్ని భాషల్లోనూ విలన్‌స్ మారుతున్నారు. ఒకప్పుడు విలన్ అంటే ఉన్న లుక్ ను పూర్తిగా తొలగించేసింది ఇండియన్ సినిమా. వైవిధ్యమైన పాత్రలతో వాళ్లూ చాలా స్టైలిష్‌ గా కనిపిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ధృవ సినిమాలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి పాత్ర ఎంత స్టైలిష్ గా ఉంది. నాన్నకు ప్రేమతోలో జగపతిబాబూ అలాగే కనిపిస్తాడు. కంటెంట్ ను బట్టే విలన్ పాత్రలూ రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు దర్శకుడుగా సంచలన విజయాలు సాధించిన తమిళ్ డైరెక్టర్ ఎస్.జే సూర్య నటుడుగా మారిన తర్వాతా అంతే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ముఖ్యంగా మోస్ట్ స్టైలిష్ విలన్ గా సత్తా చాటుతున్నాడు. అలాంటి సూర్యను రామ్ చరణ్‌ కు విలన్ గా తీసుకున్నాడు దర్శకుడు శంకర్. యస్..

శంకర్ – రామ్ చరణ్‌ కాంబోలో వస్తోన్న చిత్రంలో మెయిన్ విలన్ గా సూర్యను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఒకప్పుడు ఖుషీ సినిమాతో పవన్ కళ్యాణ్‌ కెరీర్ ను తిరుగులేని రేంజ్ లో నిలబెట్టాడు సూర్య. ఇందులో పవన్ కు కనిపించే మేనరిజమ్స్ అన్నీ సూర్యవే అన్న విషయం చాలామందికి తెలియదు. మెడ వెనక చేయి పెట్టి స్టైలిష్ గా రుద్దుకోవడం అనేది సూర్య స్టైలే. ఖుషీ తర్వాతే పవన్ కళ్యాణ్‌ ఓ రేంజ్ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిందనేది కాదనలేని సత్యం. ఆ మూవీ ఇచ్చిన మైలేజ్ తోనే ఇప్పటి వరకూ పవన్ క్రేజ్ కొనసాగుతోందని చెప్పాలి. అలాంటి సూర్య.. రామ్ చరణ్‌ కు విలన్ గా ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. పైగా ఈ మూవీ ప్రమోషన్స్ లోనూ ఖచ్చితంగా ఖుషీకి సంబంధించి ప్రశ్నలుసూర్యకు వేస్తారు చాలామంది. అదీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.ఇక శంకర్ తో రామ్ చరణ్‌ సినిమా అనుకున్నట్టుగా సాగడం లేదు. అందుకు కారణం భారతీయుడు2ను కూడా సైమల్టేనియస్ గా చిత్రీకరించాల్సి రావడం.

ముందు ప్రారంభమైన భారతీయుడు 2 కొన్ని ఇష్యూస్ తో ఆగిపోయింది. అవన్నీ క్లియర్ కావడానికి టైమ్ పడుతుందనుకున్న శంకర్.. చరణ్ తో సినిమా స్టార్ట్ చేశాడు. కానీ కేస్ నిర్మాతలు గెలిచి.. ఆ సినిమాను పూర్తి చేయాల్సిందే అన్న కోర్ట్ ఆర్డర్ తేవడంతో శంకర్ కు వేరే దారి లేక ఓ షెడ్యూల్ భారతీయుడు2కు, మరో షెడ్యూల్ చరణ్‌ సినిమాకూ కేటాయిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. సునిల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ రూపొందుతోన్న ఈ చిత్రం అనుకున్నట్టుగా షూటింగ్ సాగితే వచ్చే వేసవిలో విడుదలవుతుంది.

, , , , , ,