సోషల్‌ మీడియా రూల్‌ చేస్తున్న ఈ టైమ్‌లో ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా స్పందిస్తారో ఊహించలేం. లేటెస్ట్ గా తన 13వ సినిమా గురించి సోషల్‌ మీడియాలో ఓ చిన్న వీడియోతో హింట్‌ ఇచ్చారు వరుణ్ తేజ్‌. ఆ వీడియో అలా పోస్ట్ చేశారో లేదో, విపరీతంగా కామెంట్లు కనిపిస్తున్నాయి. నువ్వు అప్పుడే 12 సినిమాలు చేశావా బ్రో అని ఒకరంటే, మంచి కటౌట్‌ ఉంది.. వాడుకో బ్రో అని సలహా ఇస్తున్నవాళ్లు ఇంకొకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్‌ తర్వాత ఆ రేంజ్‌ ఫిగర్‌ ఉన్న హీరో నువ్వొక్కడివే. కరెక్ట్ సినిమాలు చూసి కొడితే ప్యాన్‌ ఇండియా హీరో అయిపోతావ్‌ చూసుకో అని కెరీర్‌ గైడెన్స్ ఇస్తున్న వ్యక్తి ఇంకొకరు. వరుణ్‌ ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. నెక్స్ట్ పేట్రియాటిక్‌ సినిమా మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేసినట్టు కనిపిస్తోంది.

పైలెట్‌ డ్రస్‌లో, క్లాస్‌గా ఉండే కళ్లజోడుతో, వార్‌ జెట్‌తో రకరకాల హింట్‌ ఇస్తున్న వరుణ్‌ నెక్స్ట్ మూవీ కచ్చితంగా మంచు కొండల్లో ఉంటుందనే మాట స్ట్రాంగ్‌గా వైరల్‌ అవుతోంది. పేట్రియాటిక్‌ సినిమాలు వరుణ్‌కి కొత్తేం కాదు. ఆయన నటించిన కంచె ఆ తరహా సినిమానే. కాకపోతే బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ కాలేదు. ఆ తర్వాత అంతరిక్షం కూడా వెరైటీ సినిమానే. ఆ సినిమా కూడా పెద్దగా వసూళ్లు సాధించలేదు.
రీసెంట్‌గా బాక్సర్‌గా గని సినిమా చేస్తే, అది కూడా వసూళ్లు తెచ్చుకోలేకపోయింది. ఫిదా తర్వాత ఎఫ్‌3 కాస్త పేరు తెచ్చిపెట్టింది వరుణ్‌కి. అయితే ఆ సినిమాలో వెంకటేష్‌ కూడా ఉండటంతో సక్సెస్‌ని షేర్‌ చేసుకోవాల్సి వచ్చింది. సోలో హీరోగా పర్ఫెక్ట్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు వరుణ్‌. త్వరలో అనౌన్స్ కానున్న ఈ సినిమా అయినా, కొణిదెల కుర్రాడు కోరుకుంటున్న బంపర్‌ హిట్‌ ఇస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ.

, , , , , , ,