Advertisement
‘మా’ భవనంపై వారంలో ప్రకటన చేస్తా – మంచు విష్ణు
Latest Movies Tollywood

‘మా’ భవనంపై వారంలో ప్రకటన చేస్తా – మంచు విష్ణు

Advertisement

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కొత్త భవన నిర్మాణంపై త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు ప్రెసిడెంట్ మంచు విష్ణు.

మా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న మంచు విష్ణు మాట్లాడుతూ..మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ‘మా’ కమిటీ మీటింగ్ జరిగింది. వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తాం.‌ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేసారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాను. కానీ వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించడం జరిగింది. మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాను. అయితే వారు ‘మా’ సభ్యులుగా కొనసాగుతారు. నాగబాబు, ప్రకాష్ రాజు కూడా ‘మా’ సభ్యులుగా కొనసాగుతారు. అన్నారు

Advertisement