Advertisement
  పవన్ కళ్యాణ్  పవర్ స్ట్రామ్ ను తట్టుకునేదెవరు..?
Latest Movies Tollywood

  పవన్ కళ్యాణ్  పవర్ స్ట్రామ్ ను తట్టుకునేదెవరు..?

Advertisement

నెక్ట్స్ ఫ్రైడ్ ధియేటర్లలో సందడి మామూలుగా ఉండదు. దాదాపు రెండు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రూపంలో పెద్ద సినిమా విడుదలవుతోంది. దీంతో పాటు మరో రెండు మీడియం బడ్జెట్ చిత్రాలు, రెండు డబ్బంగ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే ఆడియన్స్ ఫోకస్ అంతా భీమ్లా నాయక్ పైనే ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నెల 25న రాబోతున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ పవర్ స్ట్రామ్ ను తట్టుకుని నిలబడే సినిమాలేంటనేది ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా వినిపిస్తోన్న అంశం.
టాలీవుడ్లో  ఈ శుక్రవారం సినిమాల కంటే ఆడియన్స్ ఫోకస్ మొత్తం నెక్ట్స్ వీక్ వచ్చే సినిమాల మీదే ఉంది. ఓ పెద్ద సినిమా, రెండు మీడియం బడ్జెట్ చిత్రాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు నెక్ట్స్ వీక్ లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఆడియన్స్ లో జోష్ కనిపిస్తోంది. అయితే జనం ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీపైనే ఉంది. భీమ్లా నాయక్ ఈ నెల 25న విడుదలయ్యే ఛాన్స్ ఉందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నా… అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ చాలా మందికి నమ్మకం లేదు. కానీ మేకర్స్ సడన్ గా మూవీ 25న రిలీజ్ అని ప్రకటించి షాక్ ఇచ్చారు. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో బజ్ కూడా ఎక్కువగా ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ రావడం మాత్రం ఖాయం.
ఎంతో పోటీ ఉన్నా పవన్ ను ఢీ కొట్టేందుకు అదే రోజు రెడీ అయిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ ఇది. 25నే రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రిందటే ప్రకటించి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. భీమ్లా నాయక్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చాక ఈ సినిమా వెనక్కి వెళుతుందనుకున్నారంతా. కానీ ఆడవాళ్ళు మీకు జోహార్లు 25నే విడుదలవుతోంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని కూడా విడుదలకు రెడీ అయ్యింది. కానీ పవన్ సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గని చిత్రాన్ని వాయిదా వేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక డబ్బింగ్ చిత్రాలుగా వస్తున్న వాటిలో హిందీ మూవీ గంగూబాయ్ కి అంతగా బజ్ కనిపించడం లేదు. అయితే తమిళ్ నుంచి అజిత్ నటించిన వలిమైకి ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో తెలుగు హీరో కార్తికేయ విలన్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సినిమా 24నే రిలీజ్ అవుతోంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఎన్ని సినిమాలున్నా పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ కాంపిటీషన్ లో పవన్ ను దాటి ఖలేజా చూపించే సినిమా ఏంటనేది చూడాలి.

Advertisement