ad

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. అందులో భాగంగా అంటే సుందరానికీ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్లో ఇఫ్పుడు హీరోలంతా రొటీన్ సినిమాలు చేయడం లేదు. ప్రయోగాలు చేయడానికి, వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో నానీ కూడా చేరాడు. అందులో భాగంగా వచ్చిన చిత్రం శ్యామ్ సింగరాయ్ కూడా. గత డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రంతో నాని మంచి విజయాన్నే అందుకున్నాడు. శ్యామ్ సింగరాయ్ సక్సెస్ జోష్ లో ఉన్న నాని ఇప్పుడు అంటే సుందరానికీ అనే సినిమా చేశాడు. మైత్రీ మూవీస్ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కింది. మెంటల్ మదిలో వంటి ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ తో మెప్పించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళీ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది.
అంటే సుందరానికీ చిత్రం జూన్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చాడు. నిన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. బ్రాహ్మణ కుర్రాడి గెటప్ లో ఉన్న నాని అమెరికాలోని అన్ని ప్లేసులు తిరుగుతూ ఉంటాడు. అతని జీవితాన్ని వివరిస్తూ సరదాగా సాగే పాట ఇది. పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లెజండరీ కర్ణాటక సింగర్ పద్మశ్రీ అరుణ సాయిరామ్ ఈ పాటను పాడటం విశేషం. మొత్తంగా అంటే సుందరానికీ చిత్రంపై పాజిటివ్ బజ్ కనిపిస్తోంది.

 

, , , , , , , , , , , , , , , , , , ,