ad

యువ‌స‌మ్రాట్ నాగ‌చైత‌న్య న‌టించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బంగార్రాజు చిత్రం సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఊహించిన దాని కంటే ఎక్కువుగానే క‌లెక్ష‌న్స్ సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ సాధించింది. అయితే.. ఈ సినిమాతో పాటు నాగ‌చైత‌న్య న‌టించిన చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్న క‌థాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి బి.వి.ఎస్.ర‌వి క‌థ‌ను అందించారు. ఇందులో నాగ‌చైత‌న్య మూడు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తుండ‌డం విశేషం. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో థ్యాంక్యూ మూవీ పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ఇంత‌కీ ఈ సినిమా ఎంత వ‌ర‌కు వ‌చ్చిందంటే… ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఇందులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా, అవికాగోర్, మాళ‌విక నాయ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ విభిన్న క‌థా చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి… మ‌జిలీ, వెంకీమామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు… ఇలా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్న నాగ‌చైత‌న్య థ్యాంక్యూ మూవీతో ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తాడో చూడాలి.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,