టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్ పెద్ద కుమార్తె ఫాతిమా త్వ‌ర‌లోనే కొత్త జీవితాన్ని ప్రారంభించ‌నుంది. ఆమె పెళ్లి జ‌ర‌గ‌నుంది. రీసెంట్‌గా ఆమె నిశ్చితార్థ వేడుక‌ రెండు కుటుంబాలు, స‌న్నిహితులు, స్నేహితుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. మ‌రి సినీ సెల‌బ్రిటీ అయిన ఆలీ అల్లుడు ఏం చేస్తాడో తెలుసుకోవాల‌నే క్యూరియాసిటీ అంద‌రిలో క‌లిగింది. ఇంత‌కీ ఆలీ అల్లుడు ఏం చేస్తారంటే.. డాక్ట‌ర్‌. రీసెంట్‌గా ఆలీ కుమార్తె ఫాతిమా డాక్ట‌ర్ కోర్సును కంప్లీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకనే ఆలీ త‌న‌కు కాబోయే అల్లుడిగా డాక్ట‌ర్‌నే ఎంచుకున్నార‌ట‌.

ఆలీ కుమార్తె నిశ్చితార్థ వేడుక వివ‌రాల‌కు సంబంధించిన వీడియోను ఆలీ స‌తీమ‌ణి జుబేదా ఆలీ త‌న యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో త‌నకు కాబోయే అల్లుడు డాక్ట‌ర్ అని.. అత‌ని కుటుంబ స‌భ్యులు కూడా డాక్ట‌ర్సేన‌ని ఆమె తెలియ‌జేసింది. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక‌కి ఆలీకి స‌న్నిహితులైన సెల‌బ్రిటీలు కొంద‌రు హాజ‌ర‌య్యారు. వారిలో సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ఉన్నారు. ఆయ‌న త‌న‌దైన స్టైల్లో న‌వ్వుల‌ను పూయించారు. అలాగే సాయికుమార్ దంపతులు కూడా కార్యక్ర‌మానికి విచ్చేసి వ‌ధువ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

ఆలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అందులో 52 చిత్రాల్లో హీరోగా నటించారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు.. కుమారుడు ఉన్నారు. ఆలీ చిన్న కుమార్తె ఒకట్రెండు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆలీ వైసీపీ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తన వంతు సామాజిక సేవ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

, , , , , ,