Advertisement
ఆ రోజు అనుకున్నది ఈ రోజు నిజమైంది – రశ్మిక మందన్న
Latest Movies Tollywood

ఆ రోజు అనుకున్నది ఈ రోజు నిజమైంది – రశ్మిక మందన్న

Advertisement

పుష్ప ప్రీరిలీజ్ ఫంక్షన్ లో రశ్మిక మందన్న సందడి చేశారు. ఆమె మాట్లాడుతూ..
గీత గోవిందం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో అతథిగా వచ్చిన అల్లు అర్జున్ ను చూసి ఏదో ఒక రోజు ఈయనకు పెయిర్ గా నటించాలని కోరుకున్నా. పుష్పతో ఆ కోరిక నెరవేరింది. శ్రీవల్లిగా పుష్పరాజ్ పక్కన నటించడం కల నెరవేరినట్లుగా ఉంది. మరో వారంలో మాస్ ట్రీట్ కు రెడీగా ఉండండి. డిసెంబర్ 17న పుష్పరాజ్ తో థియేటర్ లలో కలుసుకుందాం. అన్నారు.

రశ్మిక మందన్న అల్లు అర్జున్ కు ఐ లవ్యూ చెప్పగానే ఫ్యాన్స్ లో గోల మొదలైంది. సామి సామి పాటలో రశ్మిక చిన్న స్టెప్పు వేయగానే ఆ హోరు మరింత పెరిగింది. బ్లాక్ కలర్ చీర, పొట్టి జాకెట్ తో కార్యక్రమానికి వచ్చిన రశ్మిక తన మేకోవర్ తో ఆకట్టుకుంది. పుష్ప సెకండ్ పార్ట్ కోసం షూటింగ్ చేసేందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందన్న రశ్మిక..టీమ్ మొత్తానికి పేరు పేరునా థాంక్స్ చెప్పారు.

Advertisement