టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువ సమ్రాట్ నాగచైతన్యల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ బంగార్రాజు. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుంటే.. నాగచైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది. ఇప్పటి వరకు మైసూర్ లో షూటింగ్ జరుపుకున్న బంగార్రాజు ప్రస్తుతం హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది.
అయితే.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాలు సంక్రాంతికి వస్తుండడంతో పోటీ గట్టిగానే ఉంది. మిగతా సినిమాలతో గట్టి పోటీ వుంటుందని తెలిసినా ఖచ్చితంగా పోటీలో నేను కూడా వుండాల్సిందే అని నాగార్జున ఫిక్సయ్యారా? అంటే తాజా పరిణామాలని బట్టి చూస్తే నిజమనే సంకాతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బంగార్రాజు రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనప్పటికీ.. సంక్రాంతికి రావడం పక్కా అంటున్నారు.
2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ప్రీక్వెల్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయానా చిత్రం నాగ్ ని 50 కోట్ల క్లబ్ లో చేర్చడంతో ఈ సినిమా ప్రీక్వెల్ బంగార్రాజు పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా విషయంలో నాగ్ ఎక్కడా తగ్గడం లేదు. సోగ్గాడే చిన్నినాయనా` చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న నాగార్జున ఈ ఏడాది బంగార్రాజుతో ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలనే ఆలోచనలో వున్నారు. అందుకే ఈ చిత్రాన్ని సైలెంట్ గా పూర్తి చేస్తూ సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న బంగార్రాజు విడుదల అని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం.