Advertisement
‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీకి వార్నింగ్. ఇంత‌కీ ఏమైంది.?
Latest Movies Tollywood

‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీకి వార్నింగ్. ఇంత‌కీ ఏమైంది.?

Advertisement

ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టించిన హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్ ఫుట్. ఆత‌ర్వాత వెంకీతో క‌లిసి వెంకీమామ సినిమాలో న‌టించింది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూ.. మ‌రో వైపు వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. పాయ‌ల్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చింది ఎవ‌రో కాదు.. పాయ‌ల్ మ‌ద‌రే. ఇంత‌కీ ఏమైందంటే…
ఈ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇటీవలే పసుపు రంగు కోట్ ధరించి ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. షూట్ లో భాగంగా డిజైనర్ కోరిక మేరకు పాయల్ ఇన్నర్ అందాల్ని ఎలివేట్ చేస్తూ ఫోటో షూట్లో పాల్గొంది.

అయితే.. అనుకోకుండా ఫ్యాన్ గాలికి ఆమె కోట్ పక్కకి జరగ‌డం… లోదుస్తులు ధరించకపోవడంతో అందాలు హైలైట్ అవ్వ‌డం జ‌రిగింది. ఈ వీడియోని పాయల్ తన ఇన్ స్టా ఖాతాలో చెక్ చేసుకోకుండా అప్ లోడ్ చేసింది. అనంతరం రివ్యూ చేసుకోగా అసలు సంగతి అర్ధమైంది. దీంతో ఆ వీడియోని వెంటనే డిలీట్ చేసింది. అయితే.. అప్పటికే జోరు మీదున్న నెటిజనులు ఆ లింక్ వీడియోని కాపీ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో పాయ‌ల్ అందాల ఆర‌బోత అనేది సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ అయ్యింది. నెట్టింట చీప్ కామెంట్లు వైరల్ గా మారాయి. ఆ కామెంట్లు పాయ‌ల్ ను మానసికంగా కుంగదీశాయి. ఇలాంటి టైమ్ లో ఆ వీడియో పాయల్ తల్లి కంట పడిందట‌. వెంటనే.. సినిమాల్లో న‌టించ‌డం వదిలేసి వచ్చేయమని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు పాయల్ తెలిపింది. అయితే.. ఇలాంటివి కామ‌న్ అని వాటి గురించి అంత సీరియ‌స్ గా తీసుకోవ‌చ్ద‌ని పాయ‌ల్ చెప్ప‌డంతో ఆ మాతృమూర్తి కూల్ అయినట్లు తెలుస్తోంది. అదీ.. సంగ‌తి.

Advertisement