Advertisement
క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోన్న విశ్వక్ సేన్
Latest Movies Tollywood

క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోన్న విశ్వక్ సేన్

Advertisement

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్యకాలంలో సెల్ఫ్ మేడ్ స్టార్స్ పెరుగుతున్నారు. తమ సినిమాలకు సంబంధించి అంతా తామే అయి చూసుకునే వారు ఈ కోవలో ఉంటారు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ ఒకడు. తనదైన శైలిలో ఆకట్టుకుంటూ సినిమాలు చేస్తూ వెళుతోన్న విశ్వక్ తనే డైరెక్ట్ చేసుకున్న ఫలక్ నుమా దాస్ తో మంచి గుర్తింపు వచ్చింది. దాన్ని నిలబట్టుకోవడంలో కాస్త తడబడినా యూత్ లో మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. అయితే వచ్చిన గుర్తింపును కాస్త ఓవర్ డోస్ యాటిట్యూడ్ తో ఇబ్బందుల్లో వేసుకున్నాడు. అయినా త్వరగానే సర్దుకుని తేరుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణంతో మంచి విజయం అందుకున్నాడు. ఇందులో అతని నటనకూ ప్రశంసలు వచ్చాయి.

ఇలా సెటిల్డ్ గా వెళితే అభిమానులూ పెరుగుతారు. లేనిపోని యాటిట్యూడ్ వల్ల నెగెటివిటీ తప్ప ఏం రాదు అని అర్జున కళ్యాణం విజయంతో తెలుసుకున్నట్టున్నాడు. ఈ మూవీ తర్వాత ఏంటీ అనే ప్రశ్నకు పెద్ద సమాధానమే పెట్టుకున్నాడు విశ్వక్ సేన్.ప్రస్తుతం అతను నటించిన ‘ఓరి దేవుడా’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ గురించి పెద్ద సమాచారం ఇంకా రాలేదు. త్వరలోనే అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తనే డైరెక్ట్ చేసుకుంటోన్న మరో సినిమా ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ యేడాదే విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఆ మధ్య రూమర్ గా వచ్చిన ఓ క్రేజీ ప్రాజెక్ట అఫీషియల్ గా అనౌన్స్ అయింది.

ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న అర్జున్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా సినిమా రాబోతోంది. కొన్నాళ్ల క్రితమే ఈ వార్త వచ్చినా అప్పుడు చాలామంది ఇది అయ్యేదేనా అనే డౌట్స్ వెలిబుచ్చారు. బట్ లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ న్యూస్ వచ్చింది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి నిర్మాత కూడా అర్జునే. తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇక అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ గా చెప్పకునే జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ పూర్తి కాగానే పట్టాలెక్కుతుందంటున్నారు. మరి ఇది ఏ జానర్ లో ఉంటుందో కానీ విశ్వక్ సేన్ మాత్రం సైలెంట్ గా దూసుకుపోతున్నాడనే చెప్పాలి.

Advertisement