Advertisement
వినాయక్ దూకుడు..  జోష్ లో బెల్లంకొండ
Bollywood Latest Movies Tollywood

వినాయక్ దూకుడు..  జోష్ లో బెల్లంకొండ

Advertisement
మాస్ హీరో అయిపోదామని ఫస్ట్ మూవీ నుంచే బెస్ట్ ఎఫర్ట్స్ తో దూసుకుపోతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఎంచుకునే కథలు కూడా ఆ దిశగానే ఉంటున్నాయి. బట్ విజయాల విషయంలో మాత్రం అతనికి ప్రతిసారీ చుక్కెదురైంది. చివరగా తమిళ్ బ్లాక్ బస్టర్ రాక్షసుడు రీమేక్ తో మంచి విజయం అందుకున్నాడు. అయితే గతంలో అతను చేసిన సాలిడ్ యాక్షన్ మూవీస్, ముఖ్యంగా జయ జానకి నాయకి వంటి చిత్రాల కారణంగా హిందీలో డబ్బిగ్ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగింది. ఎంత అంటే ఇక్కడ టాప్ హీరోల రేంజ్ లో అతనికి అక్కడ డబ్బింగ్ మార్కెట్ ఉంది. దీంతో ఆ మార్కెట్ ను స్ట్రెయిట్ గా దున్నేయాలని రంగంలోకి దిగాడు. తెలుగులో ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతిని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీకి మన మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం చేస్తున్నాడు. తెలుగులో చాలామంది హీరోలను మాస్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసిన వినాయక్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై చాలామంది దృష్టి ఉంది.
మొదట్లో తెలుగులో లాగా హిందీలోనూ శ్రీనివాస్ కోసం ఓ టాప్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. బట్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ తో కుదరలేదు. దీంతో చివరికి నుష్రాత్ బారుచా అనే బ్యూటీని తీసుకున్నారు. తను గతంలో ‘సోనూ కే టిటూ కి స్వీటీ’అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన రామ్ సేతులోనూ నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా ఓ సర్ ప్రైజింగ్ ఫ్యాక్టర్ చెప్పారు. హిందీ ఛత్రపతి టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందట. ఆ మధ్య అసలు మొదలైందా అనే డౌట్స్ కూడా చాలామంది వెలిబుచ్చారు. బట్ టాకీ పార్టే పూర్తయింది సర్ ప్రైజ్ చేసింది టీమ్. అంటే వినాయక్ మంచి దూకుడుమీదే ఉణ్నాడన్నమాట. ఇటు శ్రీనివాస్ సైతం జోష్ గా ఈ చిత్రీకరణలో పాల్గొన్నాడు. మరి ఈ మూవీ బాలీవుడ్ లో శ్రీనివాస్ కు ఎలాంటి డెబ్యూగా నిలుస్తుందో చూడాలి.

Advertisement