Advertisement
కమల్ హాసన్ విక్రమ్ సినిమా రివ్యూ 2.5\5
Latest Movies Reviews Tollywood Viral News

కమల్ హాసన్ విక్రమ్ సినిమా రివ్యూ 2.5\5

Advertisement

రివ్యూ : విక్రమ్
తారాగణం : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, నరైన్, చెంబన్ వినోద్ జోష్, గాయత్రి శంకర్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ : గిరిష్ గంగాధరన్
నిర్మాతలు : కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
రచన, దర్శకత్వం : లోకేష్ కనకరాజ్

రేటింగ్ : 2.5/5

ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే ఆడియన్స్ లో కొత్త క్రేజ్ వస్తుంది. అది కూడా దేశవ్యాప్తంగా అభిమానులున్న వెటరన్ స్టార్ అయితే చెప్పేదేముందీ. ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచిన కమల్ హాసన్ నుంచి విక్రమ్ మూవీ వస్తుందన్నప్పుడు కూడా ఇదే క్యూరియాసిటీ కలిగింది ప్రేక్షకుల్లో. ఆ క్యూరియాసిటీకి డబుల్ డోస్ ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచింది లోకేష్ కనకరాజ్ అనే పేరు. లేటెస్ట్ సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్స్ లో ఒకడుగా నిలిచిన లోకేష్ డైరెక్షన్ లో లోకనాయకుడు నటించిన విక్రమ్ ఎలా ఉందో చూద్దాం..

కథ :
కర్ణన్( కమల్ హాసన్) కొడుకు(కాళిదాస్ జయరాం) ప్రభుత్వానికి చెందిన ఓ సీక్రెట్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు. అతను ఓ పెద్ద డ్రగ్ మాఫియాను పట్టుకున్నాడని చంపేస్తారు. అప్పటి నుంచి కర్ణన్ తాగుబోతుగా మారతాడు. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న అతని కొడుకును జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. మరోవైపు సిటీలో ఓ ముసుగు గ్యాంగ్ ఆ డ్రగ్స్ తో సంబంధం ఉన్న వారిని చంపేస్తుంటారు. వాళ్లెవరో తెలుసునే బాధ్యత మరో ఏజెంట్ అమర్(ఫహాద్ ఫాజిల్) కు ఇస్తారు. అతను అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ తో వారికి సంబంధించిన వివరాలు తెలుసుకుని పోలీస్ లకు చెబుతాడు. ఈ మధ్యలో సంతానం(విజయ్ సేతుపతి) తనే స్వయంగా కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను తయారు చేస్తూ పోలీస్ లకు సవాల్ గా మారతాడు. మరి వాళ్లెవరు.. అమర్ కథేంటీ.. కర్ణన్ కు అమర్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటీ.. సంతానం ను పట్టుకునేది ఎవరు.? అనేది మిగతా కథ.

విశ్లేషణ :
సినిమా ఆరంభంలోనే కమల్ హాసన్ ను చంపేస్తారు. తర్వాత కథంతా అమర్ గా కనిపించే ఫహాద్ ఫాజిల్, సంతానంగా నటించిన విజయ్ సేతుపతి మధ్యే నడుస్తుంది. ఇంటర్వెల్ కు కానీ కమల్ ఎవరు..? అనేది తెలియదు. అయినా సరే ఆద్యంతం అద్భుతమైన స్క్రీన్ ప్లేతో నడిపించాడు దర్శకుడు. కమల్ హాసన్ ను మొదట్లో పరిచయం చేసిన సన్నివేశాలతో అతని పాత్రను ఎలివేట్ చేస్తాడు. కానీ ఇంటర్వెల్ తర్వాత కానీ అతనో ఘోస్ట్ లాంటివాడు అని తెలియదు అనిపిస్తాడు. ఈ కాంట్రాస్ట్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. లేడీ క్యారెక్టర్స్ కు పెద్ద ప్రాధాన్యం లేకపోయినా అమర్ భార్యను చంపే సీన్స్ ఒళ్లు గగుర్పొడుస్తాయి. ఈ మొత్తం కథంతా లక్షల కోట్ల విలువ చేసే కొకైన్ ముడిసరుకును పట్టుకున్న ఏజెంట్స్ .. దాన్ని ఎక్కడ దాచారో తెలుసుకునేందుకు విలన్స్, అక్కడికే విలన్స్ ను రప్పించి మొత్తంగా అంతం చేయాలని పోలీస్ ల మధ్య సాగే ఎపిసోడ్స్ గా నడుస్తుంది. దీంతో వరుస గ్యాంగ్ వార్స్ తో మాస్ ఆడియన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందీ విక్రమ్.

కమల్ చాలాకాలం తర్వాత ఊరమాస్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఇలాంటి పాత్రల్లో ఆయన్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు కూడా. రెండు షేడ్స్ ఉన్న రోల్. అదరగొట్టేశాడు. ఇటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి పాత్రల్లో జీవించారనే చెప్పాలి. ఈ మూవీని లోకేష్ గత సినిమా ఖైదీకి లింక్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే క్లైమాక్స్ తో సూర్యను పరిచయం చేసి సీక్వెల్ కు అద్భుతమైన రూట్ వేసుకున్నాడు దర్శకుడు. సినిమాకు మెయిన్ హైలెట్ అనిరుధ్ బిజీఎమ్. అద్భుతం అనే మాట కూడా తక్కువే అనేలా ఉందీ ఆర్ఆర్. నైట్ మోడ్ అంటే లోకేష్ కు ఇష్టమని అతని గత సినిమాలు చూస్తే తెలుస్తుంది. అది విక్రమ్ లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సో సినిమాటోగ్రఫీ అందుకు తగ్గట్టుగానే బ్రిలియంట్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది. ఫైట్స్ సూపర్బ్. ముఖ్యంగా పనిమనిషితో పాటు క్లమాక్స్ ఫైట్ చూసి తీరాల్సిందే.
ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగినా.. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించిందనే చెప్పాలి. క్లైమాక్స్ తర్వాత సూర్య ఎపిసోడ్ కు మధ్యలో ఉన్న సాగదీత అవసరం లేదేమో. ఏదేమైనా ఈ సినిమాలో కూడా డ్రగ్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం చూస్తోంటే లోకేష్ కనకరాజ్ కు ఈ నేపథ్యం బాగా కలిసొచ్చిందని రిపీట్ చేస్తున్నాడా లేక అతని పర్సనల్ లైఫ్ లో ఇంకేదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా అన్న డౌట్ వస్తే ఆశ్చర్యం లేదు. మొత్తంగా సినిమా అంతా ఒక మోడ్ లో సాగడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చకపోవచ్చు. కమల్ ఫ్యాన్స్ కు మాత్రం ఫీస్ట్. మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

ప్లస్ పాయింట్స్ :
కమల్ హాసన్
ఫహద్ ఫాజిల్
విజయ్ సేతుపతి
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
స్క్రీన్ ప్లే
డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :
ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చదు
సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సాగదీతలు

ఫైనల్ గా : పవర్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్

– యశ్వంత్

Advertisement