వరుస డిజాస్టర్స్ తో ఓవర్ నైట్ వచ్చిన క్రేజ్ ను డామేజ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. సినిమాలు పోవడం ఒకెత్తైతే.. అతని ఓవర్ యాటిట్యూడ్ మరో సమస్యగా జనం చూశారు. అందుకే లైగర్ టైమ్ లో మనోడు చేసిన ఓవరాక్షన్ కు ఓ రేంజ్ లో కౌంటర్స్ వేశారు. నిజానికి ఇప్పుడు అతనికి ఉంది వాపు మాత్రమే. దాన్ని బలుపు అని చూసుకోవడం వల్లే జనం నుంచి వ్యతిరేకత వచ్చింది.

దీన్ని సరిదిద్దుకోవాలంటే మళ్లీ ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే కానీ సాధ్యం కాదు. బట్ అది తెలుగులో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. లైగర్ వంటి ఆల్ టైమ్ డిజాస్టర్ తర్వాత చేస్తోన్న ఖుషీ సినిమా సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల పెండింగ్ లో పడిపోయింది. మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేదానికి క్లారిటీ లేదు. మరోవైపు ఆ మధ్య హరీశ్ శంకర్ తో సినిమా చేయబోతున్నాడు అనే రూమర్స్ వచ్చాయి.

బట్ హరీశ్ ఇతనితో సినిమా చేయడానికి అంత ఆసక్తిగా లేడనేది లేటెస్ట్ న్యూస్. ఆ కారణంగానే అతను బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు అనేది ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఈ టైమ్ లో ఇక తెలుగులో సినిమా చేయడం కంటే వేరే భాషకు వెళ్లడం బెటర్ అని భావించాడేమో.. మనోడు నెక్ట్స్ కన్నడలో అడుగుపెడుతున్నాడు. యస్.. విజయ్ దేవరకొండ కన్నడ దర్శకుడితో సినిమాకు సిద్ధమవుతున్నాడు.


కన్నడలో మాస్ ను మెప్పించేలా సినిమాలు చేయడంలో ఎక్స్ పర్ట్ అనిపించుకున్నాడు నర్తన్. అతని చివరి మూవీ మఫ్టీ. శివరాజ్ కుమార్, మురళీ నటించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణతో రీమేక్ చేయాలని ప్రయత్నించారు కూడా కొందరు. అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందీ మూవీ. ఆ మఫ్టీ తర్వాత మనోడు యశ్ తో సినిమా చేస్తాడనే అనౌన్స్ మెంట్ వచ్చింది.

కెజీఎఫ్2 తర్వాతే వచ్చిన అఫీషియల్ ప్రకటన ఇది. బట్ కారణాలేంటో కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అతనే విజయ్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా అఫీషియల్ గా కాంబినేషన్ గురించి వార్త రాలేదు. బట్ ఇది కూడా విజయ్ ఆప్షన్ లో ఉందంటున్నారు. ఇది సెట్ కావాలంటే ముందు హరీష్‌ తర్వాత సీన్ లోకి వచ్చిన గౌతమ్ తిన్ననూరి సినిమా గురించి తేలాలి. గౌతమ్ చెప్పే కథకు విజయ్ ఓటు వేస్తే.. నర్తన్ కు హ్యాండ్ ఇచ్చినట్టే. లేదంటే నర్తన్ తో సినిమా ఉండే చాన్స్ ఉంది.


ఏమాటకామాట.. నర్తన్ కథను కాస్త డీటెయిల్డ్ గా చెక్ చేసుకుంటే ప్యాన్ ఇండియన్ ఆడియన్స ను ఎంటర్టైన్ చేయగల టాలెంటెడ్ అతను. మఫ్టీ ఆ రేంజ్ కథే. కానీ కన్నడ వరకే పరిమితం అయింది. ఏదేమైనా కెరీర్ ఆరంభంలోనే అత్యుత్సాహంతో తమిళ్ లో నోటా అనే మూవీ చేసి డిజాస్టర్ చూశాడు విజయ్ దేవరకొండ. మరి ఇప్పుడు కెరీర్ సమస్యల్లో ఉన్నప్పుడు కన్నడ దర్శకుడితో ఆలోచనలో ఉన్నాడు. మరి ఇది వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

, , , , , , , , , , , , , , ,