విజయ్ దేవరకొండ.. ఎంత వేగంగా రైజ్ అయ్యాడో అంతే వేగంగా ఫాల్ అవుతున్నాడు. కెరీర్ ఆరంభంలోనే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మెప్పించాడు. నాని లాంటి నటుడు ఉన్నా తన ఉనికిని బలంగా చాటుకున్నాడా సినిమాతో. తర్వాత పెళ్లి సందడి వంటి చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం విజయ్ కి గుర్తింపు పెంచింది. అలా అర్జున్ రెడ్డి, గీత గోవిందం అంటూ సడెన్ గా స్టార్ రేస్ లోకి ఎంటర్ అయిపోయాడు. అటు ఇతర భాషల్లో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. బట్ ఇక్కడే తను రాంగ్ స్టెప్స్ వేశాడు. వచ్చిన విజయాల నుంచి జాగ్రత్తగా కథలను ఎంచుకోవాల్సిన టైమ్ లో తన జడ్జిమెంట్ తప్పింది. దీంతో వరుసగా ఫ్లాపులు వచ్చాయి. అయినా పూరీ జగన్నాథ్ తో చేసిన లైగర్ పై కొండంత ఆశలు పెంచుకున్నా.. ఇది దారుణమైన డిజాస్టర్ గా నిలవడంతో ఇప్పుడు మనోడు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు తంటాలు పడుతున్నాడు.

విజయ్ దేవరకొండ ఈ తరంలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడు అనడంలో ఏ డౌట్ లేదు. అయినా స్టోరీ సెలెక్షనే అతనికి మైనస్ గా మారింది. అలాగని మరీ వరస్ట్(లైగర్ తప్ప) కథలు కూడా ఎంచుకోవడం లేదు. నోటా మేటర్ పక్కన బెడితే తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ లో మేటర్ ఉంది. కానీ సరిగ్గా ఎగ్జిక్యూట్ అవలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ లోనూ ఓ పాయింట్ ఉంది. అదీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూరే. ఎవరి ఫెయిల్యూర్ అయితేనేం అప్పటికే అందరి దృష్టిలో “ఓవరాక్షన్ గాడు” అన్న పేరు తెచ్చుకున్న విజయ్ కి పెద్ద మైనస్ లు గా మార్చారు అంటారు. బట్ ఇవన్నీ ఇక్కడ జాన్తా నై.. హిట్ కొట్టారా లేదా అంతే. ఆ విషయం చాలా త్వరగా తెలుసుకుంటే మంచిది. ఇప్పటికే తెలుసుకుని ఉంటే మరీ మంచిది.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంతతో కలిసి ఖుషీ అనే సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకుడు. శివ కథలకు మరీ పెద్ద స్పానేం ఉండదు. కాబట్టి.. ఇది ఫక్తు తెలుగు మార్కెట్ వరకూ ఆగిపోయే సినిమా అనుకోవచ్చు. ఒకవేళ సమంత, విజయ్ వల్ల తెలుగును దాటితే అదో బోనస్ అవుతుంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంగతేమో కానీ రాబోయే సినిమాలపైనే విజయ్ కి ఇప్పుడు ఎక్కువ బాధ ఉంది. అందుకే తనకు మంచి హిట్ అందించే దర్శకులు, కథల వేటలో పడ్డాడు. రీసెంట్ గా దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు అని వినిపించింది. ఆ మేరకు మంచి కథ, దర్శకుడిని సెలెక్ట్ చేసే బాధ్యత దిల్ రాజే తీసుకుంటున్నాడని వినిపిస్తోంది. అలా బ్లైండ్ గా దిల్ రాజును ఫాలో అయినా ఫాల్ డౌన్ కాడు అని చెప్పడానికి లేదు. తనూ ఇన్వాల్వ్ కావాలి. కథ, కథనం విషయంలో డిస్కషన్స్ చేయాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఇప్పటికే మనోడిపై చాలామంది ఏడుస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. ఆ ఏడుపులు ఎప్పుడూ ఉండేవే. ఎటొచ్చీ మనం నవ్వుకోవాలి అంటే కావాల్సింది సూపర్ హిట్ అనే మాట.. అంతే.

, , , , , ,