ad

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, సిజిలింగ్ బ్యూటీ సమంత కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇవాళ విడుదలై ఎట్రాక్ట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ ఆగష్టులో లైగర్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆ మూవీ కంప్లీట్ అవ్వడంతో ఈ మధ్యే కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరున్న శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత కాంబోతోనే మూవీపై బజ్ ఏర్పడింది. ఆ సినిమాకి ఖుషీ అనే టైటిల్ ని పెట్టడంతో మూవీపై మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయ్. ఖుషీ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. ఆల్మోస్ట్ ఆ షెడ్యూల్ ఫినిష్ అయ్యిందని చెప్పొచ్చు. ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇవాళ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పెళ్ళి డ్రెస్ లో ఉన్న విజయ్, సమంత తమ ఆటిట్యూడ్ చూపిస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఈ పోస్టర్ కి వస్తోంది. ఫస్ట్ లుక్ తో పాటు సినిమాని ఈ ఏడాజే డిసెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు డేట్ కూడా ప్రకటించారు.

, , , , , , ,