కొన్ని కాంబినేషన్స్ గురించి చిన్న రూమర్ వచ్చినా పెద్ద వార్త అవుతుంది. ఆ కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ అలాంటిది. ఈ విషయం కొత్త తరానికి తెలియకపోయినా పాత కాలం ప్రేక్షకులకు బాగా తెలుస్తుంది. అలాంటిదే ఈ కాంబో. దర్శకుడుగా దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న మణిరత్నం, సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న రజినీకాంత్ కలిసి 30యేళ్ల తర్వాత ఓ సినిమా చేయబోతున్నారనే వార్త నిన్న, మొన్నటి వరకూ కోలీవుడ్ లో హల్చల్ చేసింద. ఇప్పుడు తెలుగులోనూ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది ఇంకా తెలియాల్సి ఉన్నా.. ఇప్పుడు వినిపిస్తోన్న రూమర్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాయి.
దర్శకుడుగా మణిరత్నం, హీరోగా రజినీకాంత్ ల రేంజ్, ఇమేజ్ పీక్స్ లో ఉన్న టైమ్ లో ఈ ఇద్దరూ కలిసి దళపతి అనే సినిమా చేశారు. మమ్మూట్టి మరో హీరోగా నటించిన ఈ మూవీని మహ భారత కథ ఆధారంగా రూపొందించాడు మణిరత్నం. శోభన, గీత హీరోయిన్లుగా నటించారు. ఇళయారాజా మ్యూజిక్ హైలెట్ గా, అద్భుతమైన కథ, కథనాలతో వచ్చిన దళపతి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

తెలుగులోనూ డబ్ అయి ఇక్కడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహా భారతాన్ని అంత అద్భుతంగా సోషలైజ్ చేసిన సినిమా మనకు అంతకు ముందు లేదు, ఆ తర్వాతా రాలేదు. అంత గొప్పగా ఆకట్టకునేలా ఆ కథను చెప్పాడు మణిరత్నం. విశేషం ఏంటంటే.. తను రోజా అనే సినిమాలో అరవింద్ స్వామిని విలన్ గా తీసుకోవాలనుకున్నప్పుడు స్క్రీన్ టెస్ట్ లాంటి పాత్రను ఈ సినిమాలో చేయించాడు మణిరత్నం. అతని స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చి ఆ తర్వాతి యేడాదే రోజాతో హీరోగా పరిచయం చేశాడు.కోలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం విడుదలై 30యేళ్లైంది.

బట్ ఆ తర్వాత మళ్లీ రజినీకాంత్, మణిరత్నం కాంబోలో సినిమా రాలేదు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ మెమరీస్ ను గుర్తు చేసుకున్నాడు రజినీకాంత్. అప్పటి నుంచే ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ రూమర్స్ నిజం చేయడనికి ముందుకొచ్చింది లైకా ప్రొడక్షన్స్. యస్.. రూమర్స్ వచ్చిన తర్వాతే ఈ కాంబినేషన్ లో సినిమా చేయాలనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు, హీరోను అప్రోచ్ అయ్యారట. దీనికి ఇద్దరూ ఓకే చెప్పారు. బట్ ఇదేప్రొడక్షన్ లో ఇప్పుడు పొన్నియన్ సెల్వన్2 రూపొందుతోంది. అది కూడా విడుదలైన తర్వాత ఈ ఇద్దరు వెటరన్ స్టార్స్ కాంబోలో మరో హై ఓల్టేజ్ మూవీ వస్తుందట.

, , , ,