Advertisement
 ఏప్రిల్ 28 నుంచి ఎఫ్3 తో వెంకీ ఆసనాలు..
Latest Movies Tollywood

 ఏప్రిల్ 28 నుంచి ఎఫ్3 తో వెంకీ ఆసనాలు..

Advertisement
హిలేరియస్ ఎంటర్టైనర్ గా బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఎఫ్2. ఈ చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు ఎఫ్3 చిత్రం రూపొందుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. అయితే అంతా ఊహించినట్టుగా మే నెలలో కాక ఏప్రిల్ లోనే థియేటర్స్ లో వెంకీ ఆసనాలు వేయించబోతున్నారట. మూడేళ్ళ క్రితం సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలకు పోటీగా ధియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఎఫ్2 మూవీ. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన ఎఫ్2 ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా… వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎఫ్2కి సీక్వెల్ గా దాదాపు సేమ్ టీమ్ తో ఇప్పుడు ఎఫ్3 మూవీ రూపొందుతోంది. సునీల్ పాత్ర ఒక్కటే కొత్తగా వచ్చి చేరింది. కోవిడ్ కారణంగా అన్ని సినిమాల్లానే ఇది కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఎఫ్3కి ఇవాళ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు. ఎఫ్3 మూవీకి రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భంలోనే మేకర్స్ మరో విషయాన్ని గుర్తు చేశారు. మా షూటింగ్ పూర్తయ్యింది…మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది అనడంతో పాటు… వస్తే కొద్దిగా ముందుగా లేక కొద్దిగా వెనక్కి వెళ్ళినా ధియేటర్స్ కి రావడం మాత్రం పక్కా అన్నారు. అంటే కోవిడ్ కారణంగా పెద్ద సినిమాలు లేదా పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ డేట్స్ లో ఏమైనా మార్పులు వచ్చినప్పుడు ఎఫ్3 వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా హింట్ ఇచ్చారు. ఏది ఏమైనా ఇఫ్పటికైతే ఎఫ్3ని ఏప్రిల్ 28న విడుదల చేయడానికి మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

Advertisement