ad

మెగా ఫామిలీ నించి హీరోగా ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్. ముఖ్యంగా వైవిధ్యమైన కథలతో మెప్పించాడు. మాస్ హీరో అనే మాయలో పూర్తిగా పడిపోకుండా మొదటి మూవీ నే ముకుంద అంటూ చేసి ఆశ్చర్య పరిచాడు. తర్వాత కంచె సినిమాతో చాలామందికి ఫేవరెట్ అయ్యాడు. మెచూర్డ్ నటనతో ఔరా అనిపించాడు. ఒక్కో సినిమాతో ఎదుగుతూ వైవిధ్యం చూపిస్తూ వెళుతోన్న వరుణ్ తేజ్ బర్త్ డే ఇవాల. ఫిదా, తొలిప్రేమ వంటి చిత్రాలతో యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ లో కూడా అభిమానులను సంపాదించుకుని గద్దలకొండ గణేష్ తో మాస్ ను మెప్పించాడు. ఒక రకంగా మెగా ఫామిలీ హీరోలకు పూర్తి భిన్నమైన దారిలో సాగుతూ సక్సెస్ లు కొడుతూ దూసుకుపోతున్నాడు వరుణ్. ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీ అవుతున్నాడు వరుణ్. అందులో మొదటిది గని.
బాక్సింగ్ గేమ్ నేపథ్యం లో తెరకెక్కిన చిత్రం గని. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. కిరణ్ కొర్రపాటి అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అద్భుతంగా వచ్చిందనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రానికి మించిన రింగ్ ఫైట్స్ ఈ మూవీలో కనిపిస్తాయని అవన్నీ ఎమోషనల్ గాను ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయంటున్నారు. గత నెలలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని మార్చ్ 18న విడుదల చేయబోతున్నారు. ఈ లోగ కొరోనా వైరస్ ప్రభావం కూడా తగ్గిపోతుందని భావిస్తున్నారు. సమ్మర్ కూడా కలిసొస్తుంది. ఇక వరుణ్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన ఓ వీడియో అదరగొడుతోంది. తక్కువ నిడివి ఉన్న మాసివ్ గా కనిపిస్తోంది. ఇప్పటికే పక్క హిట్ అనిపించుకున్న గని లో ఆ లక్షణాలు చాల ఉన్నాయి అనేలా ఉందీ వీడియో.
మరోవైపు తనలోని మరో యాంగిల్ ను చూపించిన ఎఫ్ త్రీ  సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడం లో సందేహం లేదు అనేలా ఈ సీక్వెల్ ను రెడీ చేస్తున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఐతే ఈ చిత్రాన్ని మార్చ్ ౨౫న రిలీజ్ చేస్తాం అని చెప్పింది టీమ్. బట్ ఆ టైం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఉండటం తో తాజాగా మరోసారి పోస్టుపోన్ చేసారు. ఈ సారి సమ్మర్ బరిలో ఏప్రిల్ 28న విడుదల చేస్తున్న అనౌన్స్ చేసింది టీమ్. వరుణ్ తేజ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ  కొత్త రిలీస్ డేట్ ను ప్రకటించారు. ఏదేమైనా ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాలని కురుకుంటూ వరుణ్ తేజ్ కి మనమూ హ్యాపీ బర్త్ డే చెప్పేద్దాం.

Image

Image

, , , , , , , , , , , , , , , , , , , , , , , , ,