మామూలుగా జ‌నాల‌కు ఫేవ‌రేట్ హీరోలు ఎవ‌రో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఉంటుంది. కానీ జ‌నాలు అభిమానించే హీరోల‌కు కూడా ఫేవ‌రేట్ స్టార్స్ ఉంటారుగా. మ‌రి ఆ వ‌రుస‌లో రామ్‌చ‌ర‌ణ్‌కి ఫేవ‌రేట్ స్టార్ ఎవ‌రు? ఆ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా చెప్ప‌డం కాదు, ఆయ‌న్ని ద‌గ్గ‌ర నుంచి గ‌మ‌నించిన ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న చెప్పారు. ఇది క‌దా మెగా ఫ్యాన్స్ కి ఇంట్ర‌స్టింగ్ విష‌యం అంటారా… అక్క‌డికే వ‌స్తున్నాం.
రామ్‌చ‌ర‌ణ్ అండ్ ఉపాస‌నకు న‌చ్చిన కోలీవుడ్ హీరోలు ఎవ‌రు? అనే ప్ర‌శ్న ఉపాస‌న‌కు ఎదురైంది. ఆ ప్ర‌శ్న‌కు ఉపాస‌న అస్స‌లు త‌డుముకోకుండా ఆన్స‌ర్ ఇచ్చారు.

ఉపాస‌న‌కు త‌మిళ సూప‌ర్‌స్టార్ త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ర‌జ‌నీకాంత్ సినిమాల‌ను తాను చాలా ఇంట్ర‌స్టింగ్‌గా చూస్తాన‌ని కూడా చెప్పారు.మ‌రి రామ్‌చ‌ర‌ణ్‌కి న‌చ్చిన హీరో ఎవ‌రు? అని అడిగితే హి ఈజ్ న‌న్ అద‌ర్ దేన్ త‌ల అజిత్ అని చెప్పేశారు ఉపాస‌న‌. అజిత్ స‌ర్ సినిమాలు చూడ‌టానికి మిస్ట‌ర్ సీ చాలా ఇంట్ర‌స్ట్ చూపిస్తారు. అజిత్ స‌ర్ వ‌ర్క్స్ అన్నిటిని చూసేశారు అని వివ‌రించారు ఉపాస‌న‌.ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. దిల్‌రాజు, శిరీష్ క‌లిసి శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంజ‌లి, జ‌య‌రామ్‌, సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య‌, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కార్తిక్ సుబ్బ‌రాజ్ రాసిన క‌థ ఇది. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

, , , , , ,