అద్భుతమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోస్ తో ప్రేక్షకులను నిరంతరం వినోదపరిచేందుకు ‘జీ తెలుగు’ ప్రతి క్షణం కృషి చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా వారికి ఎల్లపుడూ తోడుగా నిలిచే నటులు, దర్శకులు, ప్రొడ్యూసర్లు, మరియు టెక్నిషియన్ల శ్రమను గుర్తిస్తూ ‘జీ తెలుగు’ కుటుంబం అవార్డ్స్ తో వారిని ప్రతి సంవత్సరం సత్కరించే విషయం తెలిసిందే. ఇక ఈ సంవత్సరం కూడా ఆ సమయం రానేవచ్చింది. ఇటీవలే జరిగిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ మునుపెన్నడూలేనంత గ్రాండ్ గా సాగింది.

సినిమా మరియు టీవీ పరిశ్రమలకు చెందిన పేరుగాంచిన నటీనటులు ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొని, ‘రెడ్ కార్పెట్’ పై తమ స్టైలిష్ లుక్స్ తో మెరిశారు. కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర, బాబు మోహన్, ఐశ్వర్య పిస్సే, కరుణ, తనూజ, మేఘన రామి, చందు గౌడ, ఆషిక గోపాల్, అకుల్ బాలాజీ, రూప, మేఘన లోకేష్, మధుసుధన్, దిలీప్ ఆర్ శెట్టి, రాఖీ గౌడ, పూజ మూర్తి, జయశ్రీ రాజ్, ప్రీతీ శ్రీనివాస్, సౌంధర్య రెడ్డి తదితరులు రెడ్ కార్పెట్ పై ఫోజులతో అదరగొట్టగా, హీరోయిన్లు అంజలి మరియు రాయ్ లక్ష్మి తమ స్టైలిష్ లుక్స్ తో మెరిశారు.


‘రెడ్ కార్పెట్’ అనంతరం పలువురు నటీనటులు తమ ఆటపాలతో స్టేజిపై దద్దరిల్లే ప్రదర్శనలు చేసి అలరించారు. దీంతో, తమ అభిమాన నటులకి అవార్డు వస్తుందా లేదా అన్న అయోమయంలో ఉన్న ప్రేక్షకులకు మంచి వినోదం కూడా అందనుంది. అందుకోసం, ఇంకాస్త సమయం వేచిఉండాల్సి ఉంది.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,