ఈ మధ్య బాలీవుడ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే చాలు.. బాయ్ కాట్ ద మూవీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అది సినిమాల విజయాలపై ఎంత ప్రభావం చూపుతుందనేదిఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు చూస్తేనే అర్థం అవుతుంది. నిజానికి వీటిని లైట్ తీసుకోవాలంటారు కొందరు. కానీ వాటి ఎఫెక్ట్ బానే కనిపిస్తోంది. అయితే ఈ బాయ్ కాట్ అనే ట్రెండ్ ప్రధానంగా నెపోటిజం బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఆర్టిస్టుల సినిమాలకే ఎక్కువగా జరుగుతోంది. అలాగే అలాంటి నటీ నటులకు అడ్డాగా ఉండే కరణ్ జోహార్ బ్యానర్ సినిమా అయితే ఇంకా రెచ్చిపోతారు. ఈ అన్ని అంశాలూ ఉన్న బ్రహ్మాస్త్ర విషయంలోనూ ఈ బాయ్ కాట్ ట్రెండ్ కంటిన్యూ అయితే ఆశ్చర్యం ఏముందీ. అయితే ఇప్పటి వరకూ బాయ్ కాట్ కు కారణాలు డైరెక్ట్ గా చెప్పలేదు. బట్ బ్రహ్మాస్త్రకు ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. అంటేఈ సినిమాను ఎందుకు బాయ్ కాట్ చేయాలి అంటే ఇదుగో ఇందుకు అంటూ.. ఐదు కారణాలు చెబుతున్నారు. ఎప్పట్లానే ఇవన్నీ సిల్లీగానే ఉన్నా.. ఈ సిల్లీ పాయింట్స్ కూ కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఉంటారు కదా.. మరి ఆ పాయింట్స్ ఏంటో చూడండి.

  1. ఒకప్పుడు అలియా తనపై ట్రోల్స్ వస్తున్నప్పుడు.. ‘మీరు నన్ను ఇష్టపడకపోతే చూడటం(తన సినిమాలు) మానేయండి’ అంది. అందుకే చూడక్కర్లేదు అంటున్నారు. ఎంత సిల్లీ పాయింట్ ఇది.
  2. ఒక పాత ఇంటర్వ్యూలో రణ్‌బీర్ కపూర్ తనకు బీఫ్‌(ఆవు మాంసం) అంటే చాలా ఇష్టం అని. బాగా తింటా అనీ చెప్పాడు. సో.. ఇప్పుడు ఆవులను మరోలా చూస్తోన్న బ్యాచ్ అంతా ఈ కారణంగా మనం బ్రహ్మాస్త్ర చూడొద్దు అంటున్నారు.
  3. ఇది కరణ్‌ జోహార్ ప్రొడక్షన్ కాబట్టి చూడొద్దు. కరణ్ అంటే నెపోటిజాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తోన్న వ్యక్తి కాబట్టి అతని బ్యానర్ లో వచ్చిన సినిమాలు చూడొద్దట. గతంలో అనన్య పాండే ఉందని లైగర్ నూ బాయ్ కాట్ చేయమన్నారు.
  4. రణ్‌బీర్ కపూర్ – అలియా భట్ ఇద్దరూ వారసులుగా వచ్చిన వాళ్లే. కాబట్టి ఈ చిత్రాన్ని చూడొద్దట.
  5. అలియా భట్ ప్రెగ్నెన్సీని రణ్ బీర్ కపూర్ కామెడీ చూశాడట. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత తను బాగా బరువు పెరిగిందని అన్నాడు రణ్‌బీర్.. మరి ఇందులో తప్పేముందో వారికే తెలియాలి.

మొత్తంగా పెద్దగా పనీ పాటా లేనిఓ గుంపు ఇలా బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆర్ఆర్ఆర్ ను కూడా ఎప్పుడో దాటేసింది. సో.. సినిమా బావుంటే ఈ బాయ్ కాట్ గాళ్ల మాటలు సాగవు. బాలేకపోతే వాడేం చెప్పనవసరం లేదు. అదీ మేటర్.

, , , , , , , , , , , , ,