Movies Tollywood

టెన్షన్ లో టాలీవుడ్. ఇంతకీ ఏమైంది..?

టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య అంటే ఆంధ్రలో సినిమా టిక్కెట్ల రేట్లు. తెలంగాణలో పార్కింగ్ ఫీజు అనేది పరిష్కారం అయ్యింది. సింగిల్ స్ర్కీన్స్ లు అన్నింటిలో పార్కింగ్ ఫీజులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలంగాణలో నాలుగు ఆటలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. ఇక తేలాల్సింది ఆంధ్రలోనే. అక్కడ టిక్కెట్ల రేటు విషయం అలాగే.. సెకండ్ షో విషయం తేలాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అక్కడ సినిమా పరిశ్రమను అభివృద్ది చేసే విషయంలో సానుకూలంగా ఉన్నారని తెలిసింది.

ఆంధ్రలో కూడా సినిమాలకు ఈ వారంతానికి పర్మిషన్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇక టిక్కెట్ల రేట్ల విషయంలో కూడా సిఎమ్ జగన్ సానుకూలంగా వున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఇచ్చిన టికెట్ ల జీవో కు సవరణ జీవో త్వరలో వస్తుందని తెలుస్తోంది. ఆంధ్రలో బి సెంటర్లు ఎక్కువ. అందుచేత వాటి రేట్లే కీలకం. ప్రభుత్వం ఎ..బి సెంటర్లను క్లబ్ చేసి ఒకటే రేటు పెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. 100,70,30 రూపాయల రేట్లు ఎ బి సెంటర్లలో వుండే అవకాశం వుంది.
సి సెంటర్లకు వేరే రేట్లు వుంటాయి.

అలాగే ఇక పై పెద్ద సినిమాలకు రేట్లు పెంచే అవకాశం వుండకుండా క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఇది జరిగితే మాత్రం భారీ సినిమాలకు దెబ్బే. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు దెబ్బు. భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమాలు మొదటి రోజు టిక్కెట్ రేటును భారీగా పెంచుకునేవి. అలా చేయడం వలన ఓపెనింగ్ రోజు భారీ కలెక్షన్స్ వచ్చేవి. ఇప్పుడు పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా చేస్తే.. ఇబ్బందే. ఈ నెలాఖరు లోగా కొత్త జివో వస్తే మాత్రం ఇక ఆగస్టులో సినిమాలు ముంచెత్తడం పక్కా. మరి.. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Post Comment